ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది! అధికారుల నివేదిక ఇదే!
Tue Dec 24, 2024 10:35 Politicsఏపీలో తెలుగుదేశం పార్టీ ఆధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ అమలుపై అధికారులు తర్జనభర్జనలు పడి స్కీమ్ అమలుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అందజేశారు. మరోపక్క, దీనిపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సంఘం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఫ్రీబస్ స్కీమ్ వివరాలను సేకరించి పరిశీలించడంతో పాటు అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను కూడా పరిశీలిస్తుంది. ఇదిలా ఉంటే, ఏపీలో ప్రతిరోజూ సుమారు 44 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ 27 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో రోజూ 24 లక్షల మంది ప్రయాణిస్తుండగా రాబోయే రోజుల్లో ఈ సర్వీసుల్లోనే 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారిలో 60 శాతం మంది పురుషులు, 40 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం మొత్తం ఆక్యుపెన్సీ 69 శాతంగా ఉంది. ఎప్పుడైతే ఫ్రీబస్ స్కీమ్ అమలు చేస్తారో అప్పటి నుంచి ఈ ఆక్యుపెన్సీ 95 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇంకా చదవండి: విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!
ప్రస్తుతం ఉన్న ఆక్యుపెన్సీకి అనుగుణంగానే బస్సులు, సిబ్బంది, మెకానిక్‌లు ఉన్నారు. అయితే, ఫ్రీబస్ స్కీమ్ అమలు చేస్తే...దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు మరో 2 వేలకు పైగా బస్సులు అవసరం అవుతాయని, అదనంగా డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లు కలిపి మరో 11,500 మంది వరకు అవసరం అవుతారని అంచనా. ప్రస్తుతం ఏపీ ఆర్టీసీ ద్వారా రోజుకు 16 నుంచి 17 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇందులో మహిళా ప్రయాణికుల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల వరకు ఆదాయం ఉంటోంది. ఒకవేళ ఫ్రీబస్ స్కీమ్ అమలైతే రోజుకు ఆమేరకు మహిళా ప్రయాణికుల నుంచే వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోనుందని అధికారులు చెబుతున్నారు. అంటే నెలకు సుమారు 200 కోట్ల వరకు ఆదాయం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉచిత బస్ సౌకర్యంపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వనుంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!
బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!
డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!
2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!
USAలో మరో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.