సెకనుకు రెండు బిర్యానీలు ఆర్డర్‌! 97లక్షలపైగా చికెన్‌ బిర్యానీలు ఆర్డర్‌ చేసిన హైదరాబాదీలు!

Header Banner

సెకనుకు రెండు బిర్యానీలు ఆర్డర్‌! 97లక్షలపైగా చికెన్‌ బిర్యానీలు ఆర్డర్‌ చేసిన హైదరాబాదీలు!

  Tue Dec 24, 2024 10:41        India

అది పార్టీ అయినా.. సందర్భం ఏదైనా అందరికీ మొదట గుర్తుకు వచ్చేది బిర్యానియే. ఈ వంటకం భారతీయులకు ఇష్టమైన ఎంపికగా నిలిచింది. ఈ క్రమంలో ఆన్‌లైఫుడ్‌ ఫుడ్‌ డెలివరీ రంగంలోనే బిర్యానీనే టాప్‌ ప్లేస్‌లో నిలుస్తూ వస్తున్నది. తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది స్విగ్గి. వరుసగా తొమ్మిదో సంవత్సరం ఆన్‌లైన్‌ ఆర్డర్లలో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచి.. భారతీయులకు ప్రియమైన వంటకంగా నిలిచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 8.3 కోట్ల బిర్యానీలు ఆర్డర్‌ చేయగా.. ప్రతి నిమిషానికి 158 బిర్యానీలు, సెకనుకు రెండు బిర్యానీలు ఆర్డర్‌ చేశారు.

 

దీని తర్వాత, దోస 2.3 కోట్ల ఆర్డర్‌లతో రెండవ స్థానంలో నిలిచింది. స్విగ్గి ‘ఫుడ్ ట్రెండ్ రిపోర్ట్’ ప్రకారం.. బిర్యానీ వరుసగా తొమ్మిదవ సంవత్సరం అత్యధికంగా ఆర్డర్లు సాధించింది. 4.9లక్షల చికెన్‌ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లుగా పేర్కొంది. ఇందులో హైదరాబాదీలు అత్యధికంగా చికెన్ బిర్యానీని 97 లక్షలకుపైగా ఆర్డర్ చేశారు. ఆ తర్వాత 77 లక్షల ఆర్డర్లతో బెంగళూరు రెండో స్థానంలో, 46 లక్షల ఆర్డర్లతో చెన్నై మూడో స్థానంలో నిలిచాయి. రాత్రి సమయంలో ఎక్కువగా తిన్న ఫుడ్‌లలో చికెన్‌ బర్గర్‌ నిలిచింది. రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య 18.4లక్షల చికెన్‌ బర్గర్‌ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ రిపోర్ట్‌ పేర్కొంది. 

 

ఇంకా చదవండినిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss 

 

ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక మసాలా దోసలో బెంగళూరు ఆదిపత్యాన్ని కొనసాగించింది. బెంగళూరు వాసులు జనవరి ఒకటి నుంచి నవంబర్‌ 22 మధ్య 25లక్షల దోసెలను ఆర్డర్‌ చేశారు. ఢిల్లీ, చండీగడ్‌, కోల్‌కతాలో చోలే, ఆలూ పరాఠా, కచోరీలకు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. ఇక బెంగళూరుకు చెందిన ఓ స్విగ్గీ యూజర్‌ ఏకంగా ఏడాదిలో పాస్తా కోసం రూ.49,900 వెచ్చించాడు. దాదాపు 55 ఫెటుక్సిన్ ఆల్ఫ్రెడో, 40 మాక్, చీజ్.. 30 స్పఘెట్టి కోసం ఆర్డర్‌ పెట్టాడు. 

 

ఈ ఏడాది లంచ్‌ కోసం కంటే డిన్నర్‌కి 29శాతం ఎక్కువగా 21.5 కోట్లు ఆర్డర్లు వచ్చాయి. 24.8 లక్షల ఆర్డర్‌లతో చికెన్ రోల్ అత్యంత ఇష్టపడే స్నాక్‌గా నిలిచింది. 16.3 లక్షల ఆర్డర్లతో చికెన్ మోమోస్ రెండో స్థానంలో, 13 లక్షల ఆర్డర్లతో పొటాటో ఫ్రైస్ మూడో స్థానంలో నిలిచాయి. నివేదిక ప్రకారం, Swiggy డెలివరీ బాయ్స్‌ మొత్తం 1.96 బిలియన్‌ కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ లెక్కన కశ్మీర్‌ నుంచి కన్యా కుమారి వరకు 5.33లక్షల సార్లు ప్రయాణించడంతో సమానమని పేర్కొన్నారు. ముంబయికి చెందిన కపిల్ కుమార్ పాండే అత్యధికంగా 10,703 ఆర్డర్‌లను డెలివరీ చేశారు. కోయంబత్తూరుకు చెందిన కాళీశ్వరి ఎం మహిళ 6,658 ఆర్డర్‌లను డెలివరీ చేసి అగ్రస్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర సర్కారు! ఇకపై ఆ తరగతుల విద్యార్థులు మస్ట్​గా పాస్​ కావాల్సిందే - లేదంటే!

 

బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!

 

డబ్బులు కడితే దొంగ దొర అవుతాడా? పదేపదే నీతులు వల్లించే వైసీపీ నేత! మాజీ మంత్రి పై మంత్రి ఫైర్!

 

2025 జనవరితో ఆ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు బంద్! బ్యాకప్ లేకుంటే మీ డాటా పోయినట్టే!

 

USAలో మ‌రో తెలుగు విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి! ఎవరు? ఎందుకు? దీని వెనుక ఎవరి హస్తం!

 

నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Hyderabad #Biryani #Foods #Swiggy