ఆ అలైన్ మెంట్ మార్పు... విజయసాయిరెడ్డి 'మాస్టర్ ప్లానే'! వైకాపా నేతలపై భారీ ఆరోపణలు!

Header Banner

ఆ అలైన్ మెంట్ మార్పు... విజయసాయిరెడ్డి 'మాస్టర్ ప్లానే'! వైకాపా నేతలపై భారీ ఆరోపణలు!

  Tue Dec 24, 2024 12:57        Politics

వైకాపా నేతలు తమ ఆస్తుల విలువ పెంచుకునేందుకే గత ప్రభుత్వంలో భీమిలి-భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారి అలైన్మెంట్ను నచ్చినట్లు మార్చేశారని బాధితులు వాపోయారు. ఆ రోడ్డుకు సంబంధించిన ప్రతిపాదనలు ముందే తెలిసిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి దానికి ఇరువైపులా భూములు కొన్నారని ఆరోపించారు. కేవలం వారి ఆస్తుల విలువ పెంపు కోసమే భీమిలి మండలం నేరెళ్లవలస వద్ద నచ్చినట్లు రహదారిని వంపులు తిప్పారన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నట్లు బాధితులు కొందరు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ఛైర్మన్ ఎంవీ ప్రణవ్తోపాల్కు ఫిర్యాదు చేశారు. సోమవారం వీఎంఆర్డీఏలో నిర్వహించిన ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన వినతుల్లో ప్రతిపాదిత భీమిలి-భోగాపురం రోడ్డు ఎలైన్మెంట్ రద్దు చేయాలని పలువురు విన్నవించారు.



ఇంకా చదవండినామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం! 




పాలకులే ఇలా చేస్తే ఎలా?
‘2004లో నేరెళ్లవలస వద్ద 11.85 ఎకరాల్లో వేసిన లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశాం. వాటి మధ్య నుంచి భీమిలి-భోగాపురం రోడ్డు (70 మీటర్లు)ను వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లో చూపించారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వమే మధ్యతరగతి, విశ్రాంత ఉద్యోగుల ఆస్తులకు నష్టం కలిగేలా వ్యవహరించింది. ఆ అలైన్మెంట్ను రద్దు చేయాలి' అని పలువురు కోరారు. ‘వుడా అనుమతి ఉందన్న ధైర్యంతో పలు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేశాం. వీఎంఆర్డీఏ మాస్టర్లోన్-2041లో అవేమీ పట్టించుకోకుండా అన్యాయంగా ప్లాట్ల మధ్య నుంచి రోడ్డు ప్రతిపాదించడం దారుణం. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సొమ్ముతో కొనుగోలు చేసిన ప్లాట్లు అందులో ఉన్నాయి. రాజకీయ నేతల స్థలాలకు మేలు కలిగేలా వ్యవహరించడం సరికాదు' అని మరికొందరు తమ వినతుల్లో పేర్కొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:



ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

 

ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!

 

దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #andhrapravasi #ykapanetha #roadplans #change #scam #fruad #todaynews #flashnews #latestupdate