1995 సీఎంను త్వరలో మీరే చూస్తారు.. సంచలన ప్రకటన! వైసీపీ నాయకుల చేరికలపై ఆసక్తికర వ్యాఖ్యలు!

Header Banner

1995 సీఎంను త్వరలో మీరే చూస్తారు.. సంచలన ప్రకటన! వైసీపీ నాయకుల చేరికలపై ఆసక్తికర వ్యాఖ్యలు!

  Wed Jan 01, 2025 19:38        Politics

నాయకులు లేదా అధికారులు ఎవరూ తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 'నేను జైలు నుంచి విడుదలయ్యాక కొంతమందికి కక్ష తీర్చుకుంటానని అన్నారు. నిజమే! నేను రాజకీయ కక్ష తీర్చుకోను. ఎందుకంటే తప్పు చేసిన వారిని వదిలిపెట్టను' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనలో 1995 నాటి ముఖ్యమంత్రిని త్వరలో మీరే చూస్తారని ప్రకటన చేయడం సంచలనంగా మారింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. '1995 నాటి ముఖ్యమంత్రిని మళ్లీ చూస్తారు. ఇది ప్రారంభమై సోషల్ మీడియాకు మీరు చూశారు కదా! మిగతా కేసులు కూడా అలానే డీల్ చేస్తా' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'కేడర్ ఉద్దేశం ఒకలాగా ఉంది నా లక్ష్యం వేరుగా ఉంది. ఎందుకంటే నేను అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అవతలి వాళ్లు చేసినట్టు నేను చేయను. చట్ట ప్రకారం చేస్తా.

 

ఇంకా చదవండి: నరేంద్రమోదీ వారికి పెద్దపీట! 2025లో కేంద్ర కేబినెట్ తొలి సమావేశం.. పలు కీలక నిర్ణయాలు!

 

ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'ఎమ్మెల్యేలను పిలిచి అందరితో మాట్లాడుతున్నా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ గెలిచేట్టు ఉండాలి' అని ఆదేశించినట్లు తెలిపారు. '2004లో నన్ను ఎవరూ ఓడించలేదు' అని పేర్కొన్నారు. 'హైదరాబాద్‍ను ఎప్పుడూలేని విధంగా అభివృద్ధి చేశా. కానీ ప్రజలకు నేను చెప్పుకోలేకపోయా' అని వివరించారు. అధికారులను కూడా ఐదేళ్లు బురద గుంటలోకి తోసేశారని ఆసక్తికర ప్రకటన చేశారు. 'కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారు. సమాజానికి హాని కలిగించే ఎవరినీ నేను వదలను' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'మా ఎమ్మెల్యేలు అందరికీ కౌన్సిలింగ్ మొదలుపెట్టా. ఎమ్మెల్యేలకు తప్పులు చేయవద్దని పదేపదే హెచ్చరిస్తున్నా. వైఎస్‌ జగన్‌లాగా మేం తప్పులు చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. నాకు నా ప్రజలే హైకమాండ్' అని ప్రకటించారు. '1995లో జగన్‌లాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరు' అని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు పెరిగాయన్నారు. 'అన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవాలి అంటే సాధ్యం కాదనేది అందరూ గమనించాలి' అంటూ అభివృద్ధి, హామీలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 'తొలిసారి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీకి అవకాశం ఇచ్చా. మా పార్టీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి పదవులను కూడా బీసీలకు నేను మాత్రమే ఇచ్చా' అని సీఎం చంద్రబాబు చెప్పుకున్నారు. 'సోషల్ రీ ఇంజనీరింగ్ నేను చేస్తున్నా. చీఫ్ సెక్రటరీకి సామర్థ్యం, బీసీ రెండూ విజయానంద్‍కు అర్హతలు' అని తెలిపారు. వైసీపీ నాయకుల చేరికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవారు రాజకీయ అవసరాల కోసమే పార్టీలు మారుతున్నారు. వైసీపీ నేతల చేరికల అంశం ఈ మూడు పార్టీలలో చర్చ జరుగుతోంది. సంకీర్ణం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం' అని చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు తెలిపారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ సభ్యత్వాలకు రికార్డు స్పందన... మరో 15 రోజులు పొడిగింపు! ఏ జిల్లా టాప్ లో ఉందో తెలుసా? నారా లోకేశ్ నేతృత్వంలో దేశంలో!

 

మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. పేదలకు నూతన సంవత్సరం కానుక! ఇప్పటికే మొదలైన సర్వేలు.. వారికి ఇక పండగే పండగ!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్! జనవరి 1 నుంచి పలు రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు!

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు న్యూ ఇయర్ గిఫ్ట్! రేపట్నుంచే కొత్త పథకం! రూ.115 కోట్లు కేటాయింపు!

 

ఏపీ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక బాధ్యతలు! ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

 

కోటప్పకొండను సందర్శించిన చంద్రబాబు! పల్నాడు జిల్లా యల్లమందలో..

 

ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నా - సీఎం చంద్రబాబు! పర్యటనలో కీలక ప్రకటనలు!

 

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ కు కొత్త చార్జీలు! ఎప్పటి నుంచి అంటే!

 

వైసీపీకి మరో ఊహించని బిగ్ షాక్! ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా! ఇప్పట్లో ఆగవేమో!

 

సూపర్ ఆఫర్.. ఇదీ కావాల్సింది.. అంటూ.. మందుబాబులు! ఆ ఆఫర్ ఏంటో తెలిస్తే క్యూ కట్టాల్సిందే - అక్కడ మాత్రమే!

 

బంగాళాఖాతంపై అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

 

ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు ప్రత్యేక బహుమతి! సీఎం చంద్రబాబు విస్తృత ప్రణాళిక!

 

రాష్ట్రానికి మరో 9 ప్రాజెక్టులు - లక్షలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు! ఎస్ఐపీబీ సమావేశంలో చంద్రబాబు ఆమోదం!

 

జగన్ అండదండలతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి! డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews