విమానంలో నిద్రిస్తున్న తోటి ప్యాసింజర్‌పై మూత్రవిసర్జన! ఆయనకి ఏమి శిక్ష వేశారో తెలిస్తే షాక్!

Header Banner

విమానంలో నిద్రిస్తున్న తోటి ప్యాసింజర్‌పై మూత్రవిసర్జన! ఆయనకి ఏమి శిక్ష వేశారో తెలిస్తే షాక్!

  Sat Jan 04, 2025 14:02        Travel

అమెరికా కేంద్రంగా విమాన సర్వీసులను నిర్వహించే విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్యాసింజర్‌పై జీవితకాల నిషేధం విధించింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల్లో ప్రయాణించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విమానం మార్గమధ్యంలో నిద్రిస్తున్న తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేయడంతో నిందిత వ్యక్తిపై ఎయిర్‌లైన్స్ ఈ చర్య తీసుకుంది. నిషేధానికి గురైన వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. గత నెల 28న యూఎస్‌‌లోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం  నుంచి ఫిలిప్పీన్స్‌లోని మనీలాకు ‘యూఏ ఫ్లైట్ 189’లో అతడు ప్రయాణించాడు. విమానం నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత తన సీటు నుంచి లేచి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న జెరోమ్ గుటిరెజ్‌ అనే ప్యాసింజర్‌పై మూత్రం పోశాడు. ఆ సమయంలో బాధిత ప్యాసింజర్ గాఢ నిద్రలో ఉన్నారు.

 

ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. ఏపీలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు! ఏ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ప్రస్తుతం స్టేటస్ ఏంటంటే!

 

ఘటన జరిగిన సమయంలో జెరోమ్ గుటిరెజ్ నిద్రపోతున్నారని, తొలుత కల అనుకున్నారని, అయితే మూత్రం ఉదర భాగం నుంచి పాదాల వరకు కారడంతో విషయాన్ని గుర్తించి ఉలిక్కిపడి లేచారని ఆయన కూతురు నికోల్ కార్నెల్ తెలిపింది. విషయాన్ని విమాన సిబ్బంది తెలియజేయగా నిందిత ప్యాసింజర్‌ను ప్రశ్నించవద్దని సూచించారని, విమానంలో ఘర్షణకు దారితీస్తుందేమోనంటూ భయపడ్డారని నికోల్ కార్నెల్ వివరించింది. ఈ ఘటన విషయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వ్యవహార శైలి చాలా చూసి అసహ్యం అనిపించిందని, షాక్‌లో ఉన్నానని కార్నెల్ చెప్పింది. అయితే, ఈ ఘటనను యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరించింది. విమానం ఫిలిప్పైన్స్ చేరుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించామని, నిందితుడిపై నిషేధం కూడా విధించామని వెల్లడించింది.


ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై అత్యధిక వికెట్లు! 46 ఏళ్ల రికార్డు బద్దలు..

తల్లికి వందనం పథకం అమలుకు డేట్ ఫిక్స్! మంత్రి కీలక ప్రకటన!

నేడు (4/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే!

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss!

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం!

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు!

జగన్ అరెస్టు, అమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు!

కొత్త ఏడాదిలో మరో కొత్త స్కీమ్! రూ.500 ఉంటే చాలు! జనవరి 16 వరకే ఛాన్స్!

ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి.. అన్నింటా అద్భుతం! సాంకేతిక ప్రణాళికలు సిద్ధం!

గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ వాడుతున్నారా? ఇక ఆ UPI ఐడీలు పని చేయవు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #ViralNews #USA #UnitedAirlines