వొడాఫోన్ ఐడియా సరికొత్త రీచార్జ్ ప్లాన్! ఏడాది పొడవునా డేటా ఫ్రీ!

Header Banner

వొడాఫోన్ ఐడియా సరికొత్త రీచార్జ్ ప్లాన్! ఏడాది పొడవునా డేటా ఫ్రీ!

  Sat Jan 04, 2025 12:44        Technology

ప్రైవేటు రంగ టెలికం కంపెనీలో నెలకొన్న పోటీ నేపథ్యంలో యూజర్‌లను కాపాడుకునేందుకు, కొత్తగా వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు వివిధ రకాల ఆకర్షణీయమైన ప్లాన్‌లను ప్రకటిస్తున్నాయి. జియో, భారతి, ఎయిర్‌టెల్ టెలికం సంస్థలు తమ 4 జీ యూజర్లకు నిర్దేశిత ప్లాన్‌పై అన్‌‌లిమిటెడ్ 5 జీ డేటాను ఉచితంగా ఇస్తున్న తరుణంలో పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ ఇండియా (వీఐ) సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. తమ వినియోగదారుల కోసం వోడాఫోన్ .. ఐడియా సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా తీసుకువచ్చింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రూ.3,599 లేదా 3,699 లేదా రూ.3,799తో రీచార్జి చేసిన వారికి ఏడాది పొడవునా అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అపరిమిత డేటా అందిస్తోంది. మిగతా 12 గంటల పాటు ప్రతి రోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఈ డేటాను వినియోగించుకోకపోతే .. వారాంతం వరకు ఇది రోల్ ఓవర్ అవుతుంది. అంటే వీకెండ్ ముగిసే లోగా ఆ మొత్తం డేటాను వాడుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

 

రూ.3,699తో రీఛార్జి చేస్తే ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. రూ.3,799 తో రీఛార్జి చేస్తే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. సూపర్ హీరో ప్రీపెయిడ్ ప్లాన్‌లను త్వరలో ఇతర సర్కిళ్లకూ తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు! 

 

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే! 

 

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss! 

 

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం! 

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు! 

 

జగన్ అరెస్టుఅమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే? 

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Technology #Telecom #TelecomServices #Idea #Vodafone