మరో 2 కొత్త పథకాలు తెచ్చిన SBI బ్యాంక్! వారి కోసం స్పెషల్ FD!

Header Banner

మరో 2 కొత్త పథకాలు తెచ్చిన SBI బ్యాంక్! వారి కోసం స్పెషల్ FD!

  Sat Jan 04, 2025 14:49        Business

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు అదిరే శుభవార్త తీసుకొచ్చింది. నెల నెలా డబ్బులు దాచుకునేందుకు హర్ ఘర్ లఖ్‌పతి ఆర్‌డీ స్కీమ్‌తో పాటుగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యకే డిపాజిట్ పథకాన్ని లాంచ్ చేసింది. మరి ఈ రెండు పథకాల ప్రత్యేకతలు తెలుసుకుందాం.

 

దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. రెండు డిపాజిట్ పథకాలను లాంచ్ చేసినట్లు ఈ మేరకు పత్రికా ప్రకటన జారీ చేసింది. ఈ రెండు పథకాల్లో ఒకటి సీనియర్ సిటిజన్ల కోసం తీసుకురాగా మరొకటి నెల నెలా డబ్బులు దాచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అవే ఎస్‌బీఐ పాట్రోన్స్ ఎఫ్‌డీ స్కీమ్, హర్ ఘర్ లఖ్‌పతి ఆర్డీ స్కీమ్. ఈ రెండు కొత్త పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

ఎస్‌బీఐ ప్రకటన ప్రకారం.. 'హర్ ఘర్ లఖ్‌పతి' అనేది ఒక ప్రీ కాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. మెచ్యూరిటీ నాటికి రూ.1 లక్ష ఆపైన అందించేలా ఈ స్కీమ్ డిజైన్ చేశారు. ఆర్థిక లక్ష్యాలను చేరుకునే ప్రాసెస్‌ను ఈ స్కీమ్ మరింత సులభతరం చేస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. కస్టమర్లు ఒక ప్రణాళిక ప్రకారం పొదుపు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. చిన్న తనంలోనే ఫైనాన్షియల్ ప్లానింగ్, పొదుపు అలవాటు చేసేందుకు మైనర్లకు సైతం ఈ కొత్త ఆర్డీ స్కీమ్ అకౌంట్ అందిస్తోంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ పాట్రోన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తెచ్చింది. 80 సంవత్సరాలు ఆపైన వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపొందించినట్లు బ్యాంక్ తెలిపింది. ఈ కొత్త స్కీమ్ ద్వారా అధిక వడ్డీ రేట్లు అంధించడం, బ్యాంకుతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సీనియర్ కస్టమర్ల బంధాన్ని గుర్తించడం కోసం తీసుకొచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. ఎస్‌బీఐ పాట్రోన్స్ ఎఫ్‌డీ స్కీమ్ అనేది ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు కొత్త డిపాజిట్లర్లు సైతం అందిస్తున్నట్లు పేర్కొంది. డిపాజిట్లలో మార్కెట్ లీడర్‌‌గా తమ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం, ఆధునికతను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా కొత్త పథకాలు తీసుకొచ్చినట్లు తెలిపింది.

 

ఎస్‌బీఐ సాధారణ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇలా..
-7 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ ఇస్తోంది.
-46 రోజుల నుంచి 179 రోజులకు 6 శాతం, 180 రోజుల నుంచి 210 రోజులకు 6.75 శాతం వడ్డీ అందిస్తోంది.
-211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లకు 7 శాతం, ఏడాది నుంచి రెండేళ్లలోపు అయితే 7.30 శాతం వడ్డీ ఇస్తోంది.
-2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు అయితే 7.50 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు అయితే 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
-ఇక 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్లలోపు అయితే 7 శాతం వడ్డీ అందిస్తోంది.
-అలాగే సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ వీ-కేర్ డిపాజిట్ స్కీమ్ అందిస్తోంది. దీని ద్వారా 7.50 శాతం వడ్డీ ఇస్తోంది. అలాగే 444 రోజుల అమృత వృష్ఠి స్కీమ్ ద్వారా 7.75 శాతం వడ్డీ అందిస్తోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇకపై తెలుగులోనూ ఉత్తర్వులు ఇవ్వాలి! ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు! 

 

HDFC నుంచి మరో 2 కొత్త పథకాలు! రూ.100 ఉంటే చాలు! పూర్తి వివరాలు ఇవే! 

 

రూ.10 వేలలోపు ధరలో... మంచి శాంసంగ్​ ఫోన్లు ఇవే! వాటి ధరలు మారే అవకాశం.. Don't Miss! 

 

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! మరో కొత్త రైల్వే లైను ప్రకటించిన కేంద్రం! 

 

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు! రేపటి నుంచి ఆ పథకం అమలు! 

 

జగన్ అరెస్టుఅమెరికా కోర్టులో అభియోగాల తర్వాత ఈ ఒప్పందం! చంద్రబాబు ఏమన్నారంటే? 

 

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్! 6 లేన్లతో హైవేకు రూ.1000 కోట్లు మంజూరు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Business #Investments #Schemes #Government