పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ సృష్టించిన బీభత్సం! 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు! పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్!

Header Banner

పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ సృష్టించిన బీభత్సం! 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు! పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్!

  Mon May 27, 2024 14:28        Environment

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ సోమవారం తెల్లవారుజామున తీరాన్ని తాకింది. దీంతో బంగ్లాదేశ్, బెంగాల్ లలో భారీ వర్షాలు కురుశాయి. అంతేగాక గంటకు సుమారు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీచాయి. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. పలు ప్రాంతాల్లో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి కరెంటు సరఫరా నిలిచిపోయింది. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి దాదాపు 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో ఎక్కువగా దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన వారే ఉన్నారు. సహాయక చర్యల నిమిత్తం కోల్‌కతాతో సహా దక్షిణ బెంగాల్ లోని పలు జిల్లాల్లో 14 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

బంగ్లాదేశ్ లో తుపాను గత రాత్రి తీరాన్ని తాకడంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు ఆ దేశ విపత్తు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. అలాగే కోల్‌కతాలోని ఎంటెల్లీ వద్ద ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. దక్షిణ పరగణాస్ జిల్లాలో చెట్టు మీద పడి ఓ వృద్ధురాలు మరణించింది. నేలకొరిగిన చెట్లను తొలగించి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలుకు పలు సూచనలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గవర్నర్ డాక్టర్ ఆనంద బోస్ సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

 

వామ్మో... మీరు ఎప్పుడైనా విన్నారా ఇది! ఎలుగుబంటి మాంసం తిని ఆసుపత్రి పాలైన కుటుంబం! మెదడుకి సోకిన పురుగులు! 

 

అయితే రెమల్ తుపాన్ సోమవారం ఉదయం బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత కంటే తెల్లవారుజామున 5:30 గంటలకు 80-90 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచినట్టు వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదిలి మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ లోని నాడియా, ముర్షిదాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు తుపాను కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అథారిటీ సేవలను నిలిపివేయగా తాజాగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.

 

ఇవి కూడా చదవండి: 

ఐపీఎల్ లో కోల్‌కతా గెలవడం పై స్పందించిన మమతా బెనర్జీ! రానున్న సంవత్సరాల్లో కూడా కోల్‌కతా అద్బుత విజయాలు సాధిస్తుంది! ఎక్స్ లో పోస్ట్! 

 

హైదరాబాద్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య! వీడియో వైరల్! ఎడవకమ్మా... వచ్చేసారి గెలుస్తారులే అంటున్న నెటిజెన్లు! 

 

ఖతార్ ఎయిర్‌వేస్‌ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా! 

 

ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది! 

 

ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా! 

 

పర్యాటకుల కోసం అవస్థలు పడుతున్న మాల్దీవ్స్! దేశాన్ని సందర్శించమంటూ టూరిస్ట్ లకు విజ్ఞప్తి! తగ్గిపోతున్న ఆదాయం! 

 

అమెరికాలో మొదటి జడ్జిగా ప్రమాణ స్వీకారం - జయ బాడిగ! తెలుగు లోనే అద్భుతంగా! ఇలాంటి వారినే కదా ఆదర్శంగా తీసుకోవాలి! 

 

కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్! 

 

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్! 

 

గుజరాత్ లో తీవ్ర విషాదం! మంటల్లో చిక్కుకొని 22 మంది సజీవ దహనం! భారీ అగ్ని ప్రమాదం! కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్! 

 

యూఏఈ: టూరిస్ట్ లకు పెద్ద షాక్ ఇచ్చిన ప్రభుత్వం! వీసా గడువు తీరిపోతే భారీ జరిమానాలు! ముఖ్యంగా ఏజెన్సీలకు! 

                        

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Environment #Nature #World #Rains #Floods #Storms