మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు!

Header Banner

మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు!

  Mon Jun 10, 2024 13:04        Environment

ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లాలో 2.23 గంటలకు ప్రకంపనలు రాగా..దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. వెస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్క సారిగా నిద్రలేచిన పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే స్వల్ప ప్రకంపనలే కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదు. అంతకుముందు మే 14న పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 25కీలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించారు. కాగా, గతేడాది డిసెంబర్ లోనూ తైవాన్ తో పాటు మేఘాలయాలో భూకంపం వచ్చింది.

 

ఇవి కూడా చదవండి 

ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు! 

 

అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు! 

 

ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ప్రయాణం! ప్రమాణ స్వీకారం తర్వాత! 

 

మందుబాబులకు గుడ్ న్యూస్! పాత బ్రాండ్ లు వచ్చేస్తున్నాయి! అట్లుంటది మనతోని! 

 

సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది! 

 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంపముంచింది! జగన్ కు ముందే చెప్పాము! వైసీపీ మాజీ ఎమ్మెల్యే! 

 

లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా! 

 

తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్! 

                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Environment #Nature #Hills #EarthQuakes