తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! 3 రోజుల పాటు భారీ వర్షాలు!

Header Banner

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్! 3 రోజుల పాటు భారీ వర్షాలు!

  Wed Sep 18, 2024 12:24        Environment

గత నెలరోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఇరు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. తెలంగాణలో వర్షాల కారణంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇక ఏపీలో విజయవాడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. బుడమేరు వాగు ముంచేసింది. ఇప్పటికీ అక్కడ ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. గత వారం రోజులుగా వరుణుడు కాస్త బ్రేక్ ఇచ్చాడని సంతోషపడేలోగా ఐఎండీ(IMD) మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. రాబోయో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

 

ఇంకా చదవండిశుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం ఉంటుందని.. ఉదయం ఎండ, ఆ వెంటనే మేఘాలు.. మళ్లీ ఎండ రావడం లాటింది. జరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

 

ఇంకా చదవండిజగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు! తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా! 

 

అలాగే పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోంది. గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయి. దీంతో రానున్న 3 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు అని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇక వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు తీరప్రాంతం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి తెలిపింది. కాగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ప్లాన్ ఇదే.. తేల్చేసిన పురందేశ్వరి! ఉద్యోగులను ప్రొబేషన్ పై!

 

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్! తక్కువ ధరకే నాణ్యమైన కొత్త రకం మద్యం! కేబినెట్ సబ్ కమిటీలో!

 

మోదీకి చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు! దేశాన్ని పురోగతి దిశగా నడిపించే మనోబలాన్ని..

 

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో! పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డీఓటీ!

 

ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌! వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌!

 

ఫ్రీగా ఆధార్ అప్ డేట్... గడువు మరోసారి పొడిగించిన కేంద్రం! ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం నాటి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert