సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా స్కెచ్! జస్ట్ మిస్! పాకిస్థాన్ నుంచి కొనుగోలు!

Header Banner

సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా స్కెచ్! జస్ట్ మిస్! పాకిస్థాన్ నుంచి కొనుగోలు!

  Tue Jul 02, 2024 11:28        Cinemas

ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట జరిగిన  కాల్పుల ఘటన కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కరుడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ‘సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర’ పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. ఈ మేరకు కొత్త ఛార్జిషీట్ దాఖలు చేశారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు వెల్లడించారు.

నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్‌ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాక సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్‌’ను కూడా కొనాలని భావించినట్టు దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు.


ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ కు! దేవర జులై అప్డేట్‌ ఫ్యాన్స్ కి మంచి కిక్‌!


హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఖాన్‌పై భారీగా నిఘా పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ ఖాన్ ప్రతి కదలికను ట్రాక్ చేసేందుకు దాదాపు 60 నుంచి 70 మంది వ్యక్తుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
ఇక హత్య చేసేందుకు గాను18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది. నిందిత మైనర్‌లు దాడి చేసేందుకు గ్యాంగులో కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల మోటార్‌బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం మనకు తెలిసిందే.


ఇంకా చదవండి : కల్కి మూవీతో మతి పోగొట్టిన నాగస్విన్! ఇక ఆ పనిలోనే రాజమౌళి బిజీ బిజీ! SSMB29 !

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

మంత్రిగా జీతం తీసుకోవడానికి మనస్కరించలేదు! ఎందుకంటే! డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక..

 

పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మాజీ మంత్రి! రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకం ఈ రోజు!

 

నథింగ్ ఫోన్‌ 2పై భారీ తగ్గింపు! 50MP + 50MP కెమెరాలు, 8GB ర్యామ్‌! ఈ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌!

 

 

BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్! రూ.249 తో 45 రోజుల వ్యాలిడిటీ! మరెన్నో ప్రయోజనాలు!

 

సచివాలయ కార్యదర్శులతో పెన్షన్ పంపిణీ కుదరదు అన్న నాటి CS జవహర్! 95% తో రికార్డు సృష్టించిన చంద్రబాబు! నవరంద్రాలు మూసుకుంటున్న వైసీపీ నాయకులు!

గెలుపుకి కారణమైన మలుపు! బంతిని ఇలా కూడా పట్టుకోగలుగుతారా? బ్రిలియంట్ సూర్యకుమార్ యాదవ్!

 

డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు! పిఠాపురం పేరు ప్రపంచస్థాయిలో..

 

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా?

                          

ఆంధ్రప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #salmankhan #police #mumbai #pakisthan #bandra