ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!

Header Banner

ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!

  Wed Jul 17, 2024 08:00        Travel

ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పట్టణాలకు కూడా విమాన సర్వీసులను అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీలో కొత్తగా మరో నాలుగు విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఏపీలోని డబుల్ ఇంజిన్ సర్కారు, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత కారణంగా రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సత్యకుమార్ ట్వీట్ చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరులోని దగదర్తి, గుంటూరులోని నాగార్జునసాగర్, శ్రీకాకుళంలోని మూలపేటలో విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, కనెక్టివిటీ పెరిగి ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందంటూ సత్యకుమార్ యాదవ్ ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవలే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించిన చంద్రబాబు.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమాంతరంగా మరో ఐదారు విమానాశ్రయాలు వస్తాయని చెప్పారు. భోగాపురంతో పాటుగా దొనకొండ, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌ వద్ద విమానాశ్రయాలు నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు.

 

ఇంకా చదవండి: ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

 

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధికి పూర్తి సహకారం లభిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పద్ధతిలో మంత్రిత్వశాఖ తమ చేతిలో ఉన్నప్పుడే రాష్ట్రానికి ఉపయోగపడేలా పనులు చక్కదిద్దుకోవాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మరో నాలుగు విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. అటు భోగాపురం విమానాశ్రయాన్ని కూడా 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ డిసెంబర్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టులో టెర్మినల్ నిర్మాణం పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి 

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ! వైసీపీ కీలక నేతల ప్రమేయంపై దర్యాప్తు! 

 

అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు! 

 

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియామకం! మరొక ఐపీఎస్ అధికారి కూడా ఏపీకి! 

 

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు! 

 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా! 

 

ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! మంత్రులకు ఆదేశాలు! 

 

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం! 

 

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే! 

                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Travel #AndhraPradesh #AirTravel #AirPorts #CBN #CMCBN #TDPGovernment #APGovernment