నాగార్జున సాగర్‌ వెళ్లాలనుకుంటున్నారా! మీకోసం TGSRTC బంపర్ ఆఫర్!

Header Banner

నాగార్జున సాగర్‌ వెళ్లాలనుకుంటున్నారా! మీకోసం TGSRTC బంపర్ ఆఫర్!

  Wed Aug 07, 2024 14:32        Travel

దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగడంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, కేరళా, తెలుగు రాష్ట్రల్లో వర్షాలు దంచికొట్టాయి. మహరాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జున‌సాగర్‌కి భారీగా నీరు వచ్చి చేరడంతో నీటి మట్టం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మొత్తం 20 గేట్లను 5 ఫీట్ల వరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత సాగర్ గేట్లు తెర్చుకోవడంతో సందర్శకులు ఆ సుందర దృశ్యాలను చూసేందుకు వెళ్తున్నారు. తాజాగా సాగర్ కి వెళ్లే సందర్శకులకు TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. 

 

ఇంకా చదవండికేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

 

వివరాల్లోకి వెళితే ఎగువ ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. దీంతో పలు జలాశయాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. కాల్వలు, చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం డ్యాం నుంచి వస్తున్న వరదనీటితో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో 20 గేట్లు ఎత్తివేశారు అధికారులు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో వివిధ జిల్లాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకులు ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి పర్యాటకులు సాగర్ బారులు తీరారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

సాగర్ అందాలు సందర్శించాలనకునే వారికి తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఎంజీఎంఎస్ బస్‌స్టాండ్ నుంచి డైరెక్ట్ గా సాగర్ కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ మేరకు రీజియన్ మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ డిపో ఆధ్వర్యంలో ఈ సర్వీసులు నడుస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతిరోజ ఉదయం 5 గంటల నుంచి మొదలై.. 6.45, 7.15, 7.30., 8.00, 9.45, 10.45 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలకు సాయంత్రం 5.40 గంటలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ సేవలు సురక్షితం, సుఖవంతం అంటున్నారు ఆర్టీసీ అధికారులు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారా? బ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నాని, వంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసా? ఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Travel #India #NagarjunaSagar #NagarjunaSagarDam #Telangana #AndhraPradesh