విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

Header Banner

విజయవాడ నుండి త్వరలో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు నేరుగా! నిధులకు కొరత లేదు! విమానాశ్రయం విస్తరణ జూన్ 2025 కి పూర్తి!

  Sat Sep 14, 2024 18:47        Travel

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. 

 

శనివారం ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం విశిష్ట అతిథుల భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, సాధారణ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇతర అధికారులతో కలిసి విజయవాడ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. 

 

ఇంకా చదవండిరూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యత కింద చేపడుతున్నామన్నారు. జూన్ 2025 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. విమానాశ్రయ అభివృద్ధి పనులు ఇప్పటి వరకు 52 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిధులు, మెటీరియల్ కొరత లేదని అయినప్పటికీ ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీశారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పనులు కొంతమేర మందగించాయని, వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. జరుగుతున్న పనులకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ రూపొందించి దానిలో ప్రతిరోజు జరుగుతున్న పనుల పురోగతిని పోస్ట్ చేస్తూ తనకు వివరించాలని కేంద్ర మంత్రి సూచించారు. పనులు పూర్తయ్యేంతవరకు నెలకు ఒకసారి క్రమం తప్పకుండా పురోగతిని సమీక్షిస్తామన్నారు. 

 

ఇంకా చదవండిజగ్గయ్యపేటలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్! ప్రముఖ నేత టిడిపిలో చేరిక! మరికొంతమంది వైసీపీ నేతల మార్పు? 

 

విజయవాడ విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాల్వ పై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో గన్నవరం విమానాశ్రయ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ లక్ష్మీ కాంత్ రెడ్డి, గన్నవరం మండలం తహసీల్దార్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఐఆర్‌సీటీసీ వెంకటాద్రి టూర్ ప్యాకేజీ.. అతి తక్కువ ఖర్చుతో 4 రోజుల తిరుమల యాత్ర! ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు!

 

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌! ఆ రెండు రోజులు వైన్స్‌ బంద్‌!

 

ఈ ఆరు దేశాల్లో వాట్సాప్‌పై నిషేధం! దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలుసా?

 

రూ.932కే విమాన టికెట్.. బస్ టికెట్ కన్నా చీపే, పండుగ ఆఫర్ మిస్ అవ్వొద్దు! ఆలస్యం ఎందుకు బుక్ చేసుకోండి!

 

మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం! 77వేల మంది పదో తరగతి విద్యార్ధులకు!

 

చిన్న పరిశ్రమల నిర్వాహకులకు చంద్రబాబు గుడ్ న్యూస్! కేంద్ర ప్రభుత్వం ఈ నిధికి రూ.900 కోట్లు!

 

ఏపీతెలంగాణకు మళ్లీ భారీ వర్షాలు! పొంచి ఉన్న మరో ముప్పు..! ఆ జిల్లాలకు అలర్ట్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP