సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది!

Header Banner

సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది!

  Sun Jun 09, 2024 17:53        Associations

జోహానెస్‌బర్గ్‌లోని సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం 2024 ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకుంది.

 

జూన్ 8, 2024, శనివారం రోజున car ర్యాలీ మరియు డ్రీమ్ హిల్ హైస్కూల్ , మిడ్రాండ్ వద్ద నిర్వహించిన విజయోస్తావా సంబరాలు లో అనేకమంది తెలుగు ప్రజలు హాజరై ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

 

WhatsApp Image 2024-06-09 at 5.12.30 PM.jpeg

 

ఈ కార్యక్రమానికి గుమ్మడి శ్రీ రాములు గారు అధ్యక్షత వహించారు. 2013 నుండి సౌత్ ఆఫ్రికా తెలుగుదేశం సంఘాన్ని నిరాకంఠంగా నడిపిస్తున్న శ్రీ రాములు గారు, విచ్చేసిన వారందరికీ నమస్కారాలు తెలుపుతూ ఇంతటి ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విజయాన్ని తెలుగు జాతికి కొత్త వెలుగోనిగా పేర్కొనడం జరిగింది.

 

ఇంకా చదవండి: వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

 

ప్రారంభంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మరియు స్వర్గీయ రామోజీరావు గారికి దీప ప్రజ్వాలన చేయబడింది.

 

గత ఐదేళ్ల వైఎస్సార్‌సిపి రాక్షస పాలనలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో తెలుగుదేశం వీరులను, అమరావతి రైతులని స్మరించుకోవటం జరిగింది. ముఖ్యంగా, మాచర్ల చంద్రయ్య , Dr. సుధాకర్ గారు, కర్నూల్ అబ్దుల్ సలాం గారు తమ కుటుంబంతో సహా ప్రాణాలు అర్పించిన విషయాన్ని గుర్తుచేసుకోవటం జరిగింది. వారిని స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 

WhatsApp Image 2024-06-09 at 5.12.29 PM.jpeg

 

ఈ కార్యక్రమానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు మరియు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు వీడియో సందేశాల ద్వారా తమ సంఘీభావాన్ని తెలిపారు. వారి సందేశాలు ఈ పండుగ వాతావరణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 

ఇంకా చదవండి: తండ్రి రికార్డును బద్దలు కొడుతూ! రామ్మోహన్ నాయుడు 26 ఏళ్లకే మంత్రి!

 

సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియా వెళ్లి ఈ ఎలక్షన్స్ లో పాల్గొన్న ఆనంద్ గవీరినేని , రామకృష్ణ పారా , వంశీ బండారు, రాయుడు, కొమ్మినేని సత్య మరియు ఇతర ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులకి ధన్యవాదములు చెప్పటం జరిగింది.

 

కొమ్మినేని సాయి తేజ గారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న వైఎస్సార్‌సిపి పట్ల వ్యతిరేకత, ఆక్రోశాన్ని వివరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచిన ఈ ప్రభుత్వాన్ని తిప్పికొట్టడంలో ప్రజల నిబద్ధతను వివరించారు.

 

మువ్వా రాధా గారు మాట్లాడుతూ బలిదానాలు ఇచ్చిన తెలుగుదేశ వీర సైనికులని గుర్తు చేసుకుంటూ వారి బలిదానాలు వృధా కాలేదు అని తెలియజేశారు.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

హరి ప్రసాద్ బొమ్మసాని గారు , సుచరిత గారు మరియు ఇతరులు వారి యెక్క సందేశాలు ఇవటం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు బలిదానాలకు ఎన్నడూ వెనకాడబోరని మరియు అంతటి బలిదానాల ఫలితంగానే మనం ఈరోజు ఈ అఖండ విజయాన్ని అందుకో కలిగాము అని తెలిపారు.


వైఎస్సార్‌సిపి పాలనలో ప్రజలు అనేక అవమానాలను, అన్యాయాలను ఎదుర్కొన్నారు. వైఎస్సార్‌సిపి పాలన అవినీతి పరాకాష్టకు చేరుకొని, ప్రజాస్వామ్య విలువలను పాతాళానికి తొక్కేసింది. అభివృద్ధి లేకుండా, పథకాల అమలులో విఫలమైంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను నిర్బంధించి, వారి స్వేచ్ఛను కట్టిపడేశారు. ప్రజల సంపత్తిని అనుభవిస్తున్న వైఎస్సార్‌సిపి నాయకులు, ప్రజలకు ఎలాంటి మేలు చేయలేకపోయారు అని పలువురు పేర్కొన్నారు.

 

జన సేన తరఫున జమ్మల శ్రీను గారు మాట్లాడుతూ వైఎస్సార్‌సిపి అవినీతి పరిపాలనతో రాష్ట్రం చీకట్లోకి నెట్టబడింది. ప్రాజెక్టులు, రోడ్లు, వైద్యం, విద్యా రంగాలు అన్ని విభాగాల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆందోళనతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం ప్రజాస్వామ్యానికి కొత్త వెలుగు నిచ్చింది అని తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారి చేసిన క్రియాశీలక పాత్రను వివరించారు.

 

ఇంకా చదవండి: ఏపీని మరో బిహార్ లా మార్చేస్తున్నారు! పేర్ని నాని వ్యాఖ్యలు! వీళ్ళు ఏదో సింగపూర్ రేంజ్ లో అభివృద్ధి చేసినట్టు! 

 

గుమ్మడి శ్రీ రాములు గారు మాట్లాడుతూ, ఇటువంటి గొప్ప విజయం అందించిన ఆంధ్ర రాష్ట్రప్రజలని కొనియాడటం జరిగింది. ఈ విజయాన్నీ ఒక పెద్ద బాధ్యతగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం సహాకారంతో రాష్ట్రాని అభివృద్ది పథంలో తీసుకువెళ్లవలిసింది గా కోరుకోవటం జరిగింది. జూన్ 12th న 4 సారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలపటం జరిగింది. ఈ సందర్భం గా ఆయన సాధించినా విజయాలు, పడ్డ కష్టాలు గుర్తుచేసుకోవటం జరిగింది. ఆయన తెలుగు ప్రజలు కోసం 40 ఇయర్స్ గా చేసిన సంక్షేమం, అభివృద్ధి నీ కొనియాడటం జరిగింది.

 

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో తోకల వీర అంకమ్మరావు గారు, మువ్వా రాధ గారు , రాజేష్ పచ్చల గారు, రవి సింగు గారు మరియు ఇతరులు ఎంతో కృషిచేసిన వారికి ధన్యవాదములు చెప్పటం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా మరియు నైతికంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ గుమ్మడి శ్రీరాములు గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

 

భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో తమ సహకారం కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధంగా, జోహానెస్‌బర్గ్‌ లోని సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం, జనసేన విజయోస్తావా సంబరాలు విజయవంతంగా ముగిశాయి.

 

ఇవి కూడా చదవండి 

లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా! 

 

తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్! 

 

సాధారణ రైతు కుటుంభంలో పుట్టి విశ్వవ్యాప్తమైన కీర్తిని మూటకట్టుకున్న... ఉషోదయ కిరణం రామోజీరావు!

 

ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కూటమి విజయోత్సవ వేడుకలు! హాజరైన సభ్యులు! 

 

జగన్ ఫోటోలు ఆఫీసు నుండి చెత్తకుప్ప లోకి! వెంటనే తొలగించాలి! 

 

మెంటల్ కృష్ణ ఎక్కడ? మోగా ఫ్యామిలీ దెబ్బకు? ఎటూ కాకుండాపోయిన పోసాని! నోరు ఉంది కదా అని మాట్లాడితే, మాట్లాడటానికి నోరు లేకుండా పోతుంది! 

 

జగన్ అహంకారం వల్లే వైసీపీ ఓడిపోయింది! మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్! మన బలుపు మనకే బెడిసికొట్టడం అంటే ఇదే! 

                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Associations #TeluguMigrants #TDP #SouthAfrica