భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న 5G నెట్‌వర్క్! మీ డేటా స్పీడ్‌పై ఏవైనా మార్పులు గమనించారా! తాజా నివేదిక ఏమంటోంది!

Header Banner

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న 5G నెట్‌వర్క్! మీ డేటా స్పీడ్‌పై ఏవైనా మార్పులు గమనించారా! తాజా నివేదిక ఏమంటోంది!

  Sat Jun 22, 2024 21:17        Gadgets

భారతదేశంలో 5G నెట్‌వర్క్ విస్తరణ వేగంగా జరుగుతోంది. అనేక యూజర్లు ఇప్పటికే 5G సేవలను ఆస్వాదిస్తున్నారు. ఎయిర్‌టెల్, జియో వంటి కంపెనీలు దేశవ్యాప్తంగా విస్తృతంగా 5G నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా (VI) కూడా త్వరలో 5G నెట్‌వర్క్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు 5G సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, 5G రీఛార్జి ప్లాన్లు ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నాయి.

 

ఇంకా చదవండి: వన్‌ప్లస్ నుంచి తొలి పవర్ బ్యాంక్ రాబోతోంది! LAPTOP లు కూడా ఛార్జ్ చేస్కోవచ్చు! మార్కెట్‌లోకి లాంచ్ ఎప్పుడంటే!

 

ప్రస్తుతం 5G నెట్‌వర్క్ ద్వారా పొందుతున్న డేటా వేగం 4G కంటే చాలా ఎక్కువ. అయితే, ఓ తాజా నివేదిక ప్రకారం, 5G నెట్‌వర్క్ నాణ్యత తగ్గుతూ ఉందని, డౌన్‌లోడ్ వేగం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. ఓపెన్ సిగ్నల్ ఈ నివేదికను విడుదల చేసింది.

2023 మొదటి మూడు నెలల్లో 5G సగటు డౌన్‌లోడ్ వేగం 304Mbps ఉండగా, ఆ సంవత్సరం చివరి మూడు నెలల్లో 280.7Mbps కి తగ్గింది. ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో OTT, ఆన్‌లైన్ షాపింగ్, గేమింగ్ వంటి కారణాలతో రద్దీ వేళల్లో డౌన్‌లోడ్ వేగం తగ్గింది. అధిక వినియోగం ఇందుకు కారణమని నివేదిక చెబుతోంది.

 

ఇంకా చదవండి: ధర రూ.12,000 కే 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా! అదిరిపోయే VIVO T3 లైట్‌ మీ కోసమే!

 

ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్ పనితీరు కొన్ని రాష్ట్రాల్లో మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది. 2023 సంవత్సరం తొలి మూడు నెలల్లో ఎయిర్‌టెల్ సరాసరి డౌన్‌లోడ్ వేగం 260Mbps ఉండగా, 2024 తొలి మూడు నెలల్లో 273.6Mbps గా ఉంది.

జియో నెట్‌వర్క్ వేగం క్రమంగా తగ్గుతోంది. 2023 తొలి మూడు నెలల్లో జియో 5G సరాసరి వేగం 323.6Mbps ఉండగా, 2024 తొలి మూడు నెలల్లో 261.8Mbps కు తగ్గింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది.

 

ఇంకా చదవండి: సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఎయిర్‌టెల్, జియో సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు అందుబాటులో ధరలతో ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటీవలే జియో రూ.9 తో గంటపాటు 10GB డేటా ప్లాన్‌ను ప్రారంభించింది.

ఇటీవల ఎయిర్‌టెల్ రూ.279 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, 600 SMSలు, 2GB డేటా, Wync మ్యూజిక్, Hellotunes, మూడు నెలల అపోలో 24|7 సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు.

 

ఇంకా చదవండి: సూపర్‌ ఫీచర్లతో Boult క్రూయిజ్‌క్యామ్‌ X1 సిరీస్‌! 360 డిగ్రీలు రొటేటింగ్‌, అందుబాటు ధరలు, సేల్ వివరాలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

BoAt Airdopes 131 Elite ANC లాంచ్! టాప్ ఫీచర్లు, ధర మరియు లభ్యత వివరాలు!

 

జగ్గయ్యపేటలో రాత్రంతా అధికారుల అలర్ట్! అసలు కారణం ఇదే!

 

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్! ఖరీఫ్ పంటల MSP భారీగా పెంపు!

 

చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! నలుగురికి శిక్ష తప్పదా!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #5GServices #DataSpeed #5GInIndia #Jio5G #Airtel5G #NetworkSpeed #Smartphone #Technology #WiFiSpeed #Telecom #IndiaTech #Vodafone #NetworkNews #FiberInternet #InternetSpeed #5GIndia