జానీ మాస్టర్‌కు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌ షాక్! లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో!

Header Banner

జానీ మాస్టర్‌కు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌ షాక్! లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో!

  Sun Oct 06, 2024 10:18        Entertainment

తన వద్ద పనిచేసిన 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కాగా 2022 ఏడాదికిగానూ జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్‌ ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇదిలావుంచితే ఈ అవార్డును స్వీకరించేందుకు వీలుగా జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అవార్డును ఢిల్లీలో అందుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JaniMaster #RaveParty #Bengaluru #Hyderabad #Choreographer #Tollywood #Janasena