కొండా సురేఖ విషయంలో నాగార్జున నో కాంప్రమైజ్.. హాట్ డిబేట్! పరువు నష్టం దావా తీర్చనున్నారా?

Header Banner

కొండా సురేఖ విషయంలో నాగార్జున నో కాంప్రమైజ్.. హాట్ డిబేట్! పరువు నష్టం దావా తీర్చనున్నారా?

  Mon Oct 07, 2024 08:00        Entertainment

తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పైన సమంత పైన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయితే కొండా సురేఖ తాను కేటీఆర్ ను విమర్శించే క్రమంలో భావోద్వేగానికి గురై వ్యాఖ్యలు చేశానని తనను క్షమించమని చెప్పినప్పటికీ సురేఖను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏకంగా నాగార్జున కొండ సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేసి ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. ఒకపక్క కొండ సురేఖ తాను పొరపాటుగా మాట్లాడానని పదేపదే చెబుతున్నప్పటికీ నాగార్జున సురేఖ విషయంలో వెనక్కి తగ్గరని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో చర్చ జరుగుతుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా ఒక కారణమని భావిస్తున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తన కోపాన్ని తీర్చుకోవడానికి నాగార్జున కొండా సురేఖ వ్యవహారాన్ని వదిలిపెట్టబోరని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. కొండా సురేఖ పదేపదే క్షమాపణలు చెప్పినప్పటికీ కొండా సురేఖ తరఫున పొన్నం ప్రభాకర్ లాంటివాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ ఎవరేం మాట్లాడిన ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని అక్కినేని ఫ్యామిలీ తేల్చి చెబుతుంది.

 

ఇంకా చదవండి: జానీ మాస్టర్‌కు నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌ షాక్! లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో!

 

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో నాగార్జున తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోగా ఆ నష్టం నుంచి బయటపడడానికి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరువాత పోయిన పరువును తిరిగి దక్కించుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నాడు. ఇక ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు అక్కినేని ఫ్యామిలీ పైన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి నాగార్జున దీనిని ఆయుధంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంలో నాగార్జున ఎవరు చెప్పినా వినరు అని కొండా సురేఖ విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు నాగార్జున సిద్ధమయ్యారని చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తుండగా కొండా సురేఖ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం దాకా తీసుకువెళ్లి ఆమెకు చెక్ పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. కొండా సురేఖను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి పై బడా స్కెచ్ వేసిన నాగార్జున అందుకే ఈ వ్యవహారంలో కొంచెం కూడా వెనక్కు తగ్గడం లేదు.

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

 

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Nagarjuna #AshikaRanganath #AllariNaresh #RajTarun #NewMovie #NewMovieNagarjuna #lovedialogue #lovedialoguesInNaaSaamiRanga #naasaamiranga