నాంపల్లి కోర్టుకు నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు! కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు..కోర్టు వారు ఏమన్నారంటే!

Header Banner

నాంపల్లి కోర్టుకు నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు! కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు..కోర్టు వారు ఏమన్నారంటే!

  Tue Oct 08, 2024 17:08        Entertainment

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు నేడు రికార్డ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. కొండా సురేఖపై పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని నాగార్జునను న్యాయస్థానం ప్రశ్నించింది. తన కుటుంబంతో పాటు నాగచైతన్య-సమంత విడాకుల అంశంపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు నాగార్జున తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. 

 

ఇంకా చదవండి: సీనియర్ నటుడు: ఏపీ డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే! ఆయ‌న‌తో ఒక మంచి ఆలోచ‌నను పంచుకుంటాను!

 

రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని, అన్ని టీవీ ఛానళ్లలోనూ ఇది ప్రసారమైందని వెల్లడించారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలం సందర్భంగా కోరారు. మంత్రి కొండా సురేఖ ఇటీవల రాజకీయ విమర్శల్లో భాగంగా నాగార్జున, నాగచైతన్య, సమంత పేర్లను ప్రస్తావించారు. కేటీఆర్ తో ముడిపెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని తదితరులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు, నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు, మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. నాగార్జున రాక నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Nagarjuna #Marriage #FraudMarriage #FraudWomenToMarriagenagajuna #TollywoodWorker