జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేయడంపై కర్ణాటక ప్రభుత్వం స్పందన! మహిళల పట్ల వేధింపులు!

Header Banner

జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేయడంపై కర్ణాటక ప్రభుత్వం స్పందన! మహిళల పట్ల వేధింపులు!

  Tue Oct 08, 2024 20:50        Entertainment

ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డును రద్దు చేయడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద ఆరోపణలు వచ్చాయని,  దాంతో కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్ కు అవార్డు నిరాకరించిందని, ఈ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని దినేశ్ గుండూరావు స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: నాంపల్లి కోర్టుకు నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు! కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు..కోర్టు వారు ఏమన్నారంటే!

 

ఇలాంటి నేరగాళ్లపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో, వ్యాపారాల్లో, పరిశ్రమల్లో మహిళల పాత్ర పెరుగుతోందని... మహిళల పట్ల వేధింపులు లేని వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని దినేశ్ గుండూరావు వివరించారు. జాని మాస్టర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమేనని, అయితే న్యాయం అందరికీ ఒకటే విధంగా వర్తింపజేయాలని హితవు పలికారు. మాజీ సీఎం బీఎస్ యెడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైందని, సీఐడీ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసిందని, కానీ ఇంతవరకు విచారణ ప్రారంభం కాలేదని దినేశ్ గుండూరావు విమర్శించారు. ఇది బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JaniMaster #RaveParty #Bengaluru #Hyderabad #Choreographer #Tollywood #Janasena