వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు! ఇక కళ్లజోడు అవసరం ఉండదు!

Header Banner

వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలు! ఇక కళ్లజోడు అవసరం ఉండదు!

  Thu Oct 10, 2024 11:58        Life Style

ఒకప్పుడు ఏజ్బార్ అయిన వ్యక్తులు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. 60 ఏండ్లు దాటినా కంటి చూపు మందగించేది కాదని పెద్దలు చెప్తుంటారు. ఎక్కువ భాగం శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, సహజ సిద్ధమైన ఆహారాలు తీసుకోవడమే అందుకు కారణంగా పేర్కొంటారు. దీంతో వృద్ధాప్యం వచ్చినా కళ్లు బాగానే కనబడేవి కనుక కళ్ల జోడు అవసరం అంతగా ఉండకపోయేది. ఈ రోజుల్లో అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న వారి సంఖ్యపెరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. అయితే కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభించే ఆహారాలు తీసుకోవడంవల్ల ఎక్కువ కాలంపాటు కళ్లజోడు అవసరం లేకుండా జీవించే అవకాశం ఉంటుందని కంటి వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

 

ఇంకా చదవండిపవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి! సీఎం వచ్చే సమయంలో! 

 

* వారంలో రెండు సార్లు చేపలు : వయస్సు మీదపడినా కంటిచూపు మెరుగ్గా ఉండాలంటే వారంలో రెండుసార్లు చేపలు లేదా ఏదైనా సముద్రపు ఆహారం తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కంటి చూపును మెరుగ్గా ఉంచడంవల్ల కళ్లజోడు అవసరాన్ని నివారిస్తాయి.

 

* వాల్ నట్స్ : అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్ రోజూ రాత్రిళ్లు నీటిలో నానబెట్టి ఉదయం తినడంవల్ల కూడా కంటి చూపు మెరుగు పడుతుంది. వీటిలో విటమిన్ ఇ, ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటంవల్ల కంటి నరాలు, కణాలకు రక్షణ కల్పించడం ద్వారా చూపును కోల్పోకుండా కాపాడుతాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

* పలు రకాల గింజలు : కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన మరికొన్ని ఆహారాల్లో చియాసీడ్స్, పొద్దు తిరుగుడు గింజలు, అవిసె గింజలు, గుమ్మడి కాయ విత్తనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో విటమిన్ ఇ, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం మూలంగా కంటి చూపును మెరుగు పరుస్తాయి. అలాగే విటమిన్ ఎ, సి అధికంగా ఉండే క్యారెట్, టమాటా, యాపిల్, పైనాపిల్ ద్రాక్ష, నిమ్మ, కివీ, బొప్పాయి వంటివి కంటి ఆరోగ్యానికి మంచిది.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

*ఆకు కూరలు : దాదాపు అన్ని రకాల ఆకు కూరలు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ముఖ్యంగా పాలకూర, పాయిల్ కూర, పుంటికూర, బచ్చలి కూర, తోట కూర, చుక్క కూరలను ఆహారంలో భాగంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. వీటిలో విటమిన్ ఎ, ఇ, ఐరన్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ ఫిజికల్ హెల్తో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని, తద్వారా చిన్న వయస్సులో చూపు మందగించడం, కళ్లజోడు వాడాల్సి రావడం వంటి పరిస్థితులను నివారించవచ్చునని కంటివైద్య నిపుణులు చెప్తున్నారు.

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!

 

ప్రధాని మోదీరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..

 

మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!

 

పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారాఅయితే ఇలా చేయండి!

 

విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!

 

లండన్‌ వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?

 

వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!

 

చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

 

విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా! దేశంలోనే ప్రప్రథమంగా అమలు! ₹11 కోట్ల కేటాయింపు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #LifeStyle #Health #Eyes #RainySeason #Rains #Cure