వీటిని తినేముందు ఒకసారి ఆలోచించండి! ఎందుకంటే!

Header Banner

వీటిని తినేముందు ఒకసారి ఆలోచించండి! ఎందుకంటే!

  Thu Dec 19, 2024 21:47        Life Style

ఉన్నంతలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం రకరకాల బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుంటారు. ఖరీదైన క్రీములు వాడుతుంటారు. ఇన్ని చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. అందుకు కారణం తీసుకునే ఆహారలు కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని రకాల ఫుడ్స్ చర్మంపై త్వరగా వృద్ధాప్య ఛాయలకు కారణం అవుతాయి. అలా జరగకూడదంటే.. తీసుకోవాల్సిన ఆహారాలేవి.. తీసుకోకూడనివి ఏవో ఇప్పుడు చూద్దాం.

 

ఇంకా చదవండిబయటకు రావద్దు అంటున్న వాతావరణ శాఖ! నెల రోజులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. 

 

పిల్లలు, పెద్దలు కూడా చాక్లెట్లను ఇష్టంగా తింటారు. అయితే కొన్ని రకాల చాక్లెట్లలో అధిక చక్కెర స్థాయిలు, కొద్ది మొత్తంలో రసాయనాలు, కృత్రిమ చక్కెరలు వంటివి కలుస్తాయి. వీటిని తరచుగా తినడంవల్ల బాడీలో షుగర్ లెవల్స్ పెరగడానికి, చర్మ కణాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా స్కిన్ ఫిట్నెస్ కోల్పోతుంది. కాబట్టి చక్కెర శాతం ఎక్కువగా ఉండే చాక్లెట్లను తినకూడదు. దీనిని గుర్తించడానికి మీరు కొనే చాక్లట్లపై ఉండే హెచ్చరికను చదవవచ్చు.

 

ఇంకా చదవండి: సర్దార్ గౌతు లచ్చన్నపై గౌరవంతోనే వైకాపా నాయకుడు వచ్చినా భరించాం! తెదేపా నేతలు సహకారంపై...!

 

సాధారణంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ సోడియం లెవల్స్ అధికంగా ఉంటాయి. ఒక పరిమితి వరకు ఇది అవసరమే కానీ.. అధికంగా తీసుకుంటే మీ అందాన్ని దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా చిప్స్, మిర్చీ బజ్జీ, నూడుల్స్ వంటివి కూడా ఎక్కువగా తినే అలవాటు మీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే పాస్తా, కేక్స్, వైట్ బ్రెడ్ వంటివి తరచుగా తినడంవల్ల చర్మంపై మచ్చలు, ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!

 

అమెరికాలో పనిచేయాలని కలలు కనే వారికి శుభవార్త! ఇకపై ఆ సమస్య ఉండదు! ఈ కొత్త విధానంలో..

 

రైల్వే ప్రయాణికులకు అలర్ట్! ఈ యాప్‌లో టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా రిజర్వేషన్ దొరుకుతుంది!

 

నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలంపై మంత్రి స్పందన! జీజీహెచ్ వైద్యులతో పాటు ప్రత్యేక వైద్య బృందాలు!

 

ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!

 

టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకాబెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..

 

ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #LifeStyle #Foods #Sugars #Carbs #ProcessedFoods