పిల్లలకు చదువు మాత్రమే కాదు! ఈ అలవాట్లు నేర్పిస్తేనే వారు జీవితంలో ఏదైనా సాధిస్తారు!
Fri Dec 27, 2024 12:00 Life Styleఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాల్‌గా మారింది. అయితే, ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. పిల్లలకు విద్య, క్రమశిక్షణ, విలువలు నేర్పించడం తల్లిదండ్రులందరి పెద్ద బాధ్యత. పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. పిల్లలు భవిష్యత్తుల్లో సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనేది ప్రతి తల్లిదండ్రుల కల. పిల్లల్ని చిన్నప్పుడే కొన్ని విలువలతో పెంచితే.. యుక్త వయసులో వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే.. వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి. బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన ఐదు ఆధ్యాత్మిక అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇవి నేర్పితే పిల్లలు మంచి మార్గంలో ముందుకు సాగుతారు.
పిల్లల్ని కృతజ్ఞత భావంతో పెంచండి. ఇతరుల పట్ల ప్రేమ, గౌరవం రెండింటిని పిల్లల్లో పెంచే అలవాటు ఇది. ఇతరులు ఏదైనా సాయం చేస్తే వారికి కృతజ్ఞత తెలియజేయాలని పిల్లలకు నేర్పించాలి. అంతేకాకుండా ఇతరుల పట్ల కృతజ్ఞత భావంతో మెలగాలని పిల్లలకు చెప్పాలి. పిల్లలు ఇలా చేయడం వల్ల వారిలో మంచితనం పెరుగుతుంది. ఇతరుల కూడా మీ పిల్లలు చూసి ప్రశంసిస్తారు. మీ పెంపకాన్ని మెచ్చుకుంటారు. పిల్లలకు ఎవరైనా సాయం చేసినప్పుడు.. లేదా బొమ్మలు, బహుమతి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పేలా పిల్లలకు అలవాటు నేర్పించండి.
పిల్లల్ని అమాయకులతో పోలుస్తారు. వారి మనసులు సున్నితంగా ఉంటాయి. పిల్లల హృదయాల్లో ఉన్న అమాయకత్వం, కపటం తెలియకపోవడం లాంటివి కాపాడుకోవాలంటే వారికి చిన్నతనం నుంచే దయగా ఉండటం నేర్పండి. మనుషులతో పాటు జంతువుల పట్ల దయగా మెలిగేలా వారిని మలచండి. ఇతరుల పట్ల దయగా ఉంటే వారికి భవిష్యత్తులో చెడు చేయాలనే ఆలోచన రాదు. జంతువులతో పాటు మొక్కల్ని నాశనం చేయకూడదని కూడా నేర్పండి. ఈ చిన్న అలవాట్లతో పిల్లల హృదయాల్లో పెద్ద మార్పు తీసుకురావచ్చు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ ప్రపంచం పరధ్యానంతో నిండిపోయింది. చాలా మంది మనసు ఎక్కడో పెట్టి.. ఏం చేస్తున్నామన్న క్లారిటీ లేకుండా పనులు చేస్తున్నారు. ఇతరుల చెప్పినా మాటలని కూడా సరిగ్గా వినడం లేదు. పరధ్యానంగా ఉంటున్నారు. అందుకే పిల్లల్లో పరధ్యానాన్ని పొగొట్టడానికి వారికి ఏకాగ్రతను అలవాటు చేయండి. ఇందుకోసం కొన్ని మార్గాలను మీరు ఫాలో అవ్వచ్చు. లోతైన శ్వాస తీసుకోవడం, ఇతరుల మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినడం, కళ్లు మూసుకుని కాసేపు ప్రకృతిని అనుభూతి చెందడం లాంటి అలవాట్లను పిల్లలకు నేర్పించండి. దీంతో.. వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఏం చేస్తున్నామన్న క్లారిటీ ఉంటుంది.
క్షమాగుణం ఇది కచ్చితంగా పిల్లలకు ఉండాల్సిన అలవాటు. ఒక తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం అంత సులభం కాదు. అయితే, మనస్సును ఒకసారి నియంత్రించుకుంటే.. వారిని క్షమించడం చాలా సులభం. క్షమాపణ గుణాన్ని పిల్లలకు నేర్పండి. పగ తీర్చుకునేవారి కన్నా క్షమించేవాడు గొప్ప వాడని పిల్లలకు తెలిసేలా చెప్పండి. ఇతరుల పట్ల దయ, ప్రేమ ఉన్న వ్యక్తులు మాత్రమే క్షమించగలరని పిల్లలకు చెప్పండి. పిల్లలకు చిన్నప్పట్ని నుంచే చిన్న తప్పులకు కూడా సారీ చెప్పడం అలవాటు చేయండి.
ప్రతి బిడ్డ మనసులో ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలను ఆధ్యాత్మికతతో అనుసంధానించండి. ఉదహరణకు ఈ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తున్నారు..? ఇతరుల పట్ల దయగా ఉంటే ఏమవుతుంది..? ఇలాంటి ప్రశ్నలు వారిని అడగండి. ఆ తర్వాత వారికి అర్థమయ్యేలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇతరులకు సాయం చేయడం, కృతజ్ఞత భావం చూపడం, దయ ఇలాంటి అలవాట్లు నేర్చుకోవాలని ఆసక్తిని వారిలో రేకెత్తించండి. దీంతో.. వారు మరింత తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
పిల్లల్లో విలువలు ఉంటే వారి విజయవంతమైన జీవితానికి ఎదురుండదు. అందుకే పిల్లలకు కొన్ని విలువలు నేర్పించాలి. పిల్లలకు కుటుంబ ప్రాముఖ్యత, పెద్దల్ని గౌరవించడం, స్త్రీలను గౌరవించడం వంటివి నేర్పించాలి. ఈ బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు. అందుకే పిల్లలు ముందు మీరు కూడా నైతిక విలువలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!
జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!
రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #LifeStyle #Children #Memory #StrongMemory #Improvement
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.