ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

Header Banner

ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!

  Thu Jan 16, 2025 18:08        Health

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీలు) ఒకటి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, శరీరంలోని ఫ్లూయిడ్స్‌, ఎలక్ట్రోలైట్‌లు, యాసిడ్-బేస్ బ్యాలెన్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యమైన విధులు నిర్వర్తించే కిడ్నీలను కాపాడుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన అలవాట్లతో మీ రోజును ప్రారంభించడం వల్ల కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. హైడ్రేటెడ్ గా ఉండటం, బాగా తినడం, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సాధారణ దినచర్యల ద్వారా మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే సింపుల్‌ ఉదయాన్నే చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కెఫిన్..
ఉదయాన్నే ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం మానుకోండి. అధిక కెఫిన్ మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది మీ మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉండటానికి మితంగా కెఫిన్‌ తీసుకోండి.

 ఉదయాన్నే నీరు తాగాలి...
మీ రోజును ఒక గ్లాసు నీటితో ప్రారంభించండి. నిద్ర లేచిన తర్వాత మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హైడ్రేడెట్‌గా ఉండటం చాలా అవసరం.

 

ఇంకా చదవండి: విట‌మిన్ డి ల‌భించే వెజ్ ఆహారాలు ఇవే! వీటిని రోజూ త‌ప్ప‌క తినాలి!

 

కిడ్నీకి అనుకూలమైన అల్పాహారం..
మీ కిడ్నీలకు మేలు చేసే ఆహారాలతో మీ రోజును ప్రారంభించండి. బెర్రీలు ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చని ఆకు కూరలు అవసరమైన పోషకాలను అందిస్తాయి. అలానే ఆలివ్ ఆయిల్‌ ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది. తృణధాన్యాలు, పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన పోషకాలు అధికంగా ఉండే అల్పాహారం మీ మూత్రపిండాలకు అవసరమైన పోషకాలు అందిస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం..
యోగా, స్ట్రెచింగ్ లేదా వాకింగ్ వంటి తేలికపాటి మార్నింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మీ మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మీ కిడ్నీతో సహా మొత్తం శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచడంలో సహాయపడుతుంది.

హెర్బల్ టీ లేదా ప్రోబయోటిక్స్...
డాండెలైన్ రూట్ టీ వంటి హెర్బల్ టీలతో మీ రోజును ప్రారంభించండి. ఈ టీలు కిడ్నీ డీటాక్సిఫికషన్‌కి తోడ్పడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిస్తాయి, మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

బ్లడ్ షుగర్ లెవల్స్..
లో గ్లైసెమిక్ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

రక్తపోటు...
ఉదయాన్నే యోగా లేదా ధ్యానం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి రక్తపోటు అదుపులో ఉండటం చాలా అవసరం.

ఉప్పు తగ్గించండి..
బ్రేక్‌ఫాస్ట్‌లో అధిక సోడియం కలిగిన ఆహారాలను నివారించండి. ఎక్కువ ఉప్పు తీసుకుంటే ఫ్లూయిడ్స్‌ నిలిచేందుకు దారి తీస్తుంది. మీ మూత్రపిండాలను ఒత్తిడికి గురి చేస్తుంది,. కాబట్టి మీ మూత్రపిండాలను బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి తక్కువ ఉప్పు ఉండే ఆహార పదార్థాలతో రోజు ప్రారంభించండి.

డీప్‌ బ్రీథింగ్‌..
డీప్‌ బ్రీథింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు ప్రాక్టీస్ చేయడానికి రోజు కొన్ని నిమిషాలు కేటాయించండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టు? వేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్! బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు!

 

మంత్రి ఇంటిపై డ్రోన్ కలకలం.. టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ! వారిపై కేసు నమోదు!

 

ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..

 

అకౌంట్ లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ.. ఉచితంగా 6 వేల రూపాయలు.. ఇలా కూడానా?

 

నేడు (16/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి ఊహించని షాక్.. త్వరలో చాలామంది వైకాపా నేతలు జైలుకే! పొలిట్ బ్యూరోలో 30శాతం కొత్తవారు రావాలని..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #HealthCare #Tips #Nereḍupaṇḍlu