అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!

Header Banner

అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!

  Wed Jul 17, 2024 08:00        U S A

అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సెనేటర్. అయితే మరో ప్రత్యేక విషయం ఏంటంటే వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన వ్యక్తి. ముఖ్యంగా తెలుగు సంతతి వ్యక్తి కావడం విశేషం. 

 

ఆమె పేరు చిలుకూరి. ఉషా చిలుకూరి వాన్స్ తల్లిదండ్రు లు చాలా ఏండ్ల క్రితం ఏపీ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. 2015 నుంచి న్యాయ సేవల సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్ లో కార్పొరేట్ లిటిగేటర్ గా పనిచేస్తు న్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

అంతకుముందు 2013లో యేల్ యూనివర్సిటీలో లా చేస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్ పరిచ యం అయ్యారు వారి పరిచయం ప్రేమగా మార డంతో..2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారు లు ఇవాన్, వివేక్, కుమార్తే మిరాబెల్. ఉపాధ్యక్ష పదవికి ఒహాయే సెనేటర్ జేడీ వాన్స్ ఉషా చిలుకూరి రాజకీయాల్లో మొదట్నుంచీ భర్తకు అండగా నిలుస్తు న్నారు. 

 

రెండేళ్ల క్రితం ఒహాయో సెనేటర్ గా జేడీ వాన్స్ పోటీ చేసిన సమయంలోనూ ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యత లను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన వాన్స్ మొదటిసారిగా అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు. వాస్తవానికి లా కోర్సు పూర్తి చేసిన తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంఫిల్ చేసేటప్పుడు ఉషా చిలుకూరి, డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలిగా ఉన్నారు. అప్పట్లో ఆమె లెఫ్ట్ వింట్, లిబరల్ గ్రూప్స్ తో కలిసి పనిచేయగా..వివాహం తర్వాత ఉషా పార్టీ మారారు. భర్త జేడీ వాన్స్ సలహామేరకు రిపబ్లికన్ పార్టీలో చేరారు..

 

ఇవి కూడా చదవండి 

టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి నియామకం! మరొక ఐపీఎస్ అధికారి కూడా ఏపీకి! 

 

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు! 

 

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా! 

 

ఉచిత ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం! మంత్రులకు ఆదేశాలు! 

 

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం! 

 

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే! 

                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants