కాల్పులు జరిగిన చోటే ట్రంప్‌ మరో సభ! బట్లర్‌కు వస్తున్నా అంటూ పోస్టు!

Header Banner

కాల్పులు జరిగిన చోటే ట్రంప్‌ మరో సభ! బట్లర్‌కు వస్తున్నా అంటూ పోస్టు!

  Fri Oct 04, 2024 12:56        U S A

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఇటీవలే తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో మరో సభకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం బట్లర్‌ కు వస్తున్నానంటూ తనపై కాల్పులు జరిగినప్పటి ఫొటోను ట్రంప్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ట్రంప్‌ ట్వీట్‌పై ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ ఎక్స్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ట్రంప్‌కు మద్దతుగా ఆ సభకు తాను కూడా హాజరవుతానని ప్రకటించారు.

 

ఇంకా చదవండిఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం! ఎక్కడో తెలుసా? 

 

జూలై 13న అమెరికాలోని పెన్సిల్వేనియాలో చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ వేదికపై మాట్లాడుతూ తనకు కుడివైపున ఉన్న ఓ అక్రమ వలసదారుల గణాంకాలకు సంబంధించిన చార్ట్‌ను చూపిస్తూ అటు వైపు తల తిప్పారు. ఆ తర్వాత దుండగుడు కాల్పులు జరపగా బుల్లెట్‌ ట్రంప్‌ చెవిని తాకింది. ఒక వేళ ట్రంప్‌ అటువైపు తిరగకుంటే బుల్లెట్‌ నేరుగా తలలోకి దూసుకెళ్లేది. ఇక ఈ కాల్పుల ఘటనలో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరే ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ ఘటన తర్వాత ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. తనపై దాడి జరిగిన పెన్సిల్వేనియాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీ కోసం తాను బట్లర్‌ కు తిరిగి వెళ్తున్నట్లు తెలిపారు. ‘ఇటీవలే నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహించబోతున్నాను. నేను మా ప్రియమైన ఫైర్‌ఫైటర్‌ కోరే గౌరవార్థం ఆయన్ని స్మరించుకుంటూ భారీ ర్యాలీ చేపట్టబోతున్నా. ఇందుకోసం పెన్సిల్వేనియాలోని బట్లర్‌కు తిరిగి వెళ్తున్నాను. ఈ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. వివరాల కోసం వేచి ఉండండి’ అని గతంలో తన పోస్ట్‌లో ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group  

 



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants