కేరళలో తీవ్ర విషాదం! విరిగిపడ్డ కొండచరియలు! 24 కి చేరుకున్న మృతుల సంఖ్య!

Header Banner

కేరళలో తీవ్ర విషాదం! విరిగిపడ్డ కొండచరియలు! 24 కి చేరుకున్న మృతుల సంఖ్య!

  Tue Jul 30, 2024 10:49        Environment, Australia

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24 కి చేరింది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 24 మంది చనిపోగా.. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (KSDMA), అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) ఘటనా స్థలంలో సహాయకచర్యలు చేపడుతున్నాయి. అదనపు సహాయక బృందాలు వయనాడ్ కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు హెలికాప్టర్లు.. ఎంఐ-17, ఏఎలాచ్లను రంగంలోకి దించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. 225 మంది ఆర్మీ అధికారులు సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ముండకై, చురల్మల, అట్టమాల, నూల్పుజ గ్రామల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ముండకైలో అర్ధరాత్రి 2 గంటలకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలు వరదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా కచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

 

ఇంకా చదవండి633 మంది భారతీయ విద్యార్థులు మృతి! కారణాలు వింటే..! వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి! 

 

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. మంత్రులు వయనాడ్ లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని ప్రకటించారు. ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది.

   

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం! వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!

 

జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత? దానికి కారణం అదేనా!

 

 నిరుద్యోగులకు శుభవార్త.! అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఇదే!

 

గన్నవరం నుంచి దేశంలోని పలుచోట్లకు విమానాలు! కేశినేని చిన్ని వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి!

  

అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది భారతీయులు! ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా..

 

ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం! అసలు ఏం జరిగిందంటే!

             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Environment #Rains #Storms #Nature #AndhraPradesh #WeatherAlert #RainAlert #LandSLides #Kerala #Wayanad