న్యూజిలాండ్: టిడిపి విజయోత్సవాలను కోలాహలంగా చేసుకున్న ఎన్నారై టిడిపి సభ్యులు! ఆనందంగా రక్తదాన శిబిరాలు!

Header Banner

న్యూజిలాండ్: టిడిపి విజయోత్సవాలను కోలాహలంగా చేసుకున్న ఎన్నారై టిడిపి సభ్యులు! ఆనందంగా రక్తదాన శిబిరాలు!

  Thu Jun 13, 2024 22:49        Others

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో NRI TDP NZ సంబరాలు చేసుకుంది, పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినందుకు టీడీపీ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇన్ని రోజులు ఉన్న ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు. కొందరు ఎన్నారైలు అయితే స్వదేశానికి కూడా వచ్చే అవకాశం లేకుండాపోయింది. ఒక్క సారిగా అందరికీ విముక్తి లభించింది. ఈ గెలుపు సందర్భంగా న్యూజిలాండ్ లో తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఒక ప్రదేశంలో సమావేశమై తమ ఆనందాన్ని ఒక వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున న్యూజిలాండ్ లోని వివిధ నగరాల్లోని వారు ఆక్లాండ్ కి వచ్చి ప్రతి ఒక్కరితో తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటపాటలతో రోజంతా ఒక పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా వేడుకలు చేసుకున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

దీనికి సరిగ్గా నాలుగు రోజులు ముందు జూన్ ఒకటవ తారీఖున లెజెండరీ డా. నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని న్యూజిలాండ్ తెలుగుదేశం పార్టీ (టిడిపి) కమిటీ సభ్యులు ఆక్లాండ్‌లో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ స్థాపకుడు మాత్రమే కాకుండా ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు.

 

ఇంకా చదవండిసుప్రీంకోర్టులో విచారణ! నీట్‌ పేపర్ లీకేజీపై కేంద్రం! ఎన్టీఏకు నోటీసులు!

 

భారతీయ సినిమా మరియు రాజకీయాలకు ఎన్టీఆర్ చేసిన సేవలకు నివాళులర్పించి, ప్రముఖ టిడిపి నాయకులు మరియు కమిటీ సభ్యుల ప్రసంగాలతో మొదలైన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గౌరవార్థం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో అత్యంత ముఖ్యమైన అంశం 22 మంది రక్తదానం చేసి అన్నగారిని స్మరించుకోవడం. ఈ సందర్భంగా, స్వచ్ఛంద సేవకులకు, దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. NRI TDP న్యూజిలాండ్ కమిటీ ఎన్టీఆర్ 101వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆక్లాండ్‌లోని తెలుగు సమాజాన్ని ఒకచోట చేర్చి తరతరాలకు స్ఫూర్తిదాయకం అయిన అన్నగారి చరిత్రను స్మరించుకుకోవడం చాలా ఆనందదాయకమని అది కూడా న్యూజిలాండ్ లాంటి దేశంలో దీన్ని నిర్వహించిన నిర్వాహకులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

 

ఇవి కూడా చదవండి 

కువైట్: అగ్ని ప్రమాదంలో మృత దేహాల తరలింపుకు ప్రత్యేక విమానాలు! కువైట్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం! ఇకపై ఎక్కువ కానున్న తనిఖీలు! 

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు! రాజధాని రైతుల ఘన స్వాగతం! 

 

జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే! 

 

పిన్నెల్లి బాధితుడికి కత్తార్ ఎన్నారై టిడిపి సభ్యుడు ఆర్థిక సహాయం! అర్ధరాత్రి సమయంలో కూడా లోకేష్ ప్రతిస్పందన! సంతోష వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు 

 

యూఎస్ కౌన్సిల్ జనరల్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఆళ్ళ"! ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా! 

 

పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు! 

 

రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి! చంద్రబాబు దిశానిర్దేశం! 

 

ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ! 

                                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #NRIs #NRITDP #Politics #NewZealand