భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం ముదురుతోందా! ఖలిస్తానీ నాయకుడికి కెనడా నివాళి!

Header Banner

భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం ముదురుతోందా! ఖలిస్తానీ నాయకుడికి కెనడా నివాళి!

  Wed Jun 19, 2024 11:31        Others

కెనడా మరోసారి వివాదాస్పద చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కెనడా పార్లమెంట్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించారు. నిజ్జర్ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంఘటన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత ప్రభుత్వంతో చర్చల అవకాశాలు పరిశీలిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. ఇటీవలే జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రూడో సమావేశమయ్యారు.

 

ఇంకా చదవండి:  మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

కెనడాలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం మౌనం పాటించారు. నిజ్జర్‌ను 2023 జూన్ 18న సర్రేలో కాల్చి చంపారు. భారత్ విడుదల చేసిన 40 మంది తీవ్రవాదుల జాబితాలో నిజ్జర్ కూడా ఉండటం గమనార్హం. ఈ హత్యకేసులో కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్‌, కరణ్‌ప్రీత్ సింగ్‌ అనే నలుగురు భారతీయులను నిందితులుగా గుర్తించారు. సర్రేలో జరిగిన ఈ హత్యపై విచారణ కొనసాగుతోంది. నిజ్జర్ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF)కి చీఫ్.

ఈ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ఆరోపించింది. ఈ ఆరోపణను భారత్ తీవ్రంగా ఖండించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఇటలీలో జరిగిన జీ-7 సదస్సులో మోదీ, ట్రూడో భేటీ అయ్యారు. ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత విషయాల్లో భారత్‌తో కొత్తగా ఏర్పడిన సంబంధాల గురించి ట్రూడో తెలిపారు.

 

ఇంకా చదవండి:  మూడోసారి కూడా ఆర్బీఐ గవర్నర్‌గా! శక్తికాంత దాస్ కొనసాగనున్నారా!

 

హర్దీప్ సింగ్ నిజ్జర్ పంజాబ్‌లో జన్మించాడు. 1992లో కెనడాకు వెళ్లి, 1997లో నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించి శరణార్థిగా కెనడాకు చేరుకున్నాడు. అతను పౌరసత్వం పొందలేకపోయాడు. చివరికి కెనడియన్ మూలానికి చెందిన మహిళను వివాహం చేసుకుని అక్కడ స్థిరపడ్డాడు. నిజ్జర్ సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (SJF)లో చేరాడు.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య 2023 జూన్‌లో సర్రేలో జరిగింది. గురుద్వారాలోని పార్కింగ్ స్థలంలో నిజ్జర్ తన ట్రక్కులో ఉండగా కాల్చి చంపారు. కెనడియన్ భద్రతా సంస్థల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అతనిపై పలువురు వ్యక్తులు బుల్లెట్లు కాల్చారు. ఈ ఘటన తర్వాత భారతదేశం, కెనడా మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.

 

ఇంకా చదవండి:  తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

మహిళా, గిరిజన సంక్షేమానికి కొత్త శకం! సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సంధ్యారాణి!

 

ఎంపీ స్థానాన్ని రాహుల్ వదులుకుంటారా! వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగనుందా!

 

వైసీపీ సీక్రెట్లు బయటపడ్డాయా? రాజకోట రహస్యం!

 

కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!

 

జపాన్‌ను కుదిపేస్తున్న STSS! స్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ప్రాణాంతకం!మాంసాన్ని తినే బ్యాక్టీరియా జపాన్‌లో విస్తరిస్తోంది!

 

ఉక్రెయిన్ శాంతి ప్రకటనపై వెనుకడుగు వేసిన భారత్! రష్యా ఉనికి లేని సమావేశం అని వ్యాఖ్య!

 

రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

 

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!

 

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #HardeepSinghNijjar #CanadaIndiaRelations #Khalistan #JustinTrudeau #IndianDiplomacy #Terrorism #InternationalRelations #DiplomaticTensions #IndiaCanada #GlobalPolitics