కెనడా మ‌రో కీల‌క నిర్ణ‌యం! భారతీయ విద్యార్థులకు పెరగనున్న ఆర్థిక ఇబ్బందులు!

Header Banner

కెనడా మ‌రో కీల‌క నిర్ణ‌యం! భారతీయ విద్యార్థులకు పెరగనున్న ఆర్థిక ఇబ్బందులు!

  Tue Sep 03, 2024 13:32        Others

కెన‌డాలోని జ‌స్టిన్ ట్రూడో ప్ర‌భుత్వం విదేశీ విద్యార్థుల ప‌ట్ల తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై విదేశీ విద్యార్థులు త‌మ జీవ‌నవ్యయం కోసం క్యాంప‌స్ వెలుప‌ల వారానికి 24 గంట‌లకు మించి ప‌నిచేయ‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. ఈ కొత్త నిబంధ‌న ఈ వారంలోనే అమ‌ల్లోకి రానుంది. 

 

ఈ నిబంధ‌న కార‌ణంగా ఆ దేశంలో ఉన్నత విద్య కోసం వెళ్లిన లక్ష‌లాది మంది విదేశీ విద్యార్థులకు, ప్ర‌ధానంగా అధిక సంఖ్య‌లో ఉన్న‌ భారతీయ విద్యార్థులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తనున్నాయి. కాగా, గ‌తంలో కెనడాలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే క్యాంపస్‌ వెలుపల పనులు చేసుకునేందుకు వీలుండేది. 

 

ఇంకా చదవండిమళ్లీ కుట్ర? బ్యారేజీని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నమా? గేట్ 69 వద్ద బోటుల ప్రమాదం వెనుక ఏముందీ?

 

అయితే, క‌రోనా సంక్షోభ సమయంలో ఆ దేశంలో కార్మికుల కొరత ఏర్పడటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా ఎత్తి వేశారు. ఈ వెసులుబాటు గడువు ఈ ఏడాది ఏప్రిల్‌ 30తో ముగియడంతో ఇప్పుడు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. అయితే, అంతర్జాతీయ విద్యార్థుల కోసం కెనడాలో వేసవి లేదా శీతాకాలం సెల‌వుల స‌మ‌యంలో పని గంటలపై ఎటువంటి పరిమితులు ఉండవు. 

 

ఇదిలాఉంటే.. 2022లో కెనడాలోని 5.5 లక్షల మంది విదేశీ విద్యార్థులలో 2.26 లక్షల మంది ఇండియ‌న్ స్టూడెంట్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం. సుమారు 3.2 లక్షల మంది భారతీయులు స్టూడెంట్ వీసాలపై కెనడాలో ఉంటూ గిగ్ వర్కర్లుగా ఆ దేశ‌ ఆర్థిక వ్యవస్థకు సహకరించడం జ‌రిగింది. 

 

ఇంకా చదవండివైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బైతన సోషల్ మీడియా ఖాతాల్లో!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక క్యాంపస్ వెలుపల ఉద్యోగాల ద్వారా వ‌చ్చే ఆదాయం భారతీయ విద్యార్థులకు వారి భోజన, వసతి ఖ‌ర్చుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. కాగా, అక్క‌డ చాలా స్టాండర్డ్ వర్క్ షిఫ్టులు 8 గంటల నిడివితోనే ఉంటాయి. దాంతో ఇప్పుడు తీసుకువ‌చ్చిన కొత్త నిబంధ‌న‌ ప్రకారం విద్యార్థులు వారానికి మూడు పార్ట్-టైమ్ షిఫ్టుల వరకు మాత్రమే పని చేయగలరు. దీని వలన వారు తమ అద‌న‌పు ఖర్చులను భరించడం కష్టమవుతుంద‌ని విద్యార్థులు వాపోతున్నారు. 

 

ఇక‌ ఇప్పటికే కెన‌డా స‌ర్కార్‌ వలస విధానాలను మార్చడంతో పాటు స్టడీ పర్మిట్లపై పరిమితి విధించిన విష‌యం తెలిసిందే. అటు శాశ్వత నివాస దరఖాస్తుల సంఖ్యను కుదించాలని నిర్ణయించింది. దీంతో ఎంతో మంది విదేశీ విద్యార్థులను కష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు క్యాంప‌స్ వెలుప‌ల జాబ్స్‌పై ప‌రిమితి విధించ‌డంతో వారి క‌ష్టాలు రెట్టింపు అయ్యాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహరైన్ లో నటసింహం నందమూరి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు! గల్ఫ్ వైడ్ ప్రముఖులతో 19 న మెఘా ప్రోగ్రాం - అభిమానులతో సందడే సందడి!

 

శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!

 

అమెరికాలో దారుణం.. యువ‌తిని కాల్చి చంపిన భార‌త సంత‌తి వ్య‌క్తి! అసలు ఏమి జరిగింది అంటే!

 

నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!

 

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!

 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!

 

వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?

 

94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?

 

క్రెడిట్‌ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!

 

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్‌డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!

 

యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Canada #Employment #WorkPermit #Immigrants #IndianMigrants