స్నాప్‌చాట్ వినియోగంలో మోసగాళ్ల హవా! నగ్నచిత్రాలు, డ్రగ్స్ విక్రయాలకూ వేదిక!

Header Banner

స్నాప్‌చాట్ వినియోగంలో మోసగాళ్ల హవా! నగ్నచిత్రాలు, డ్రగ్స్ విక్రయాలకూ వేదిక!

  Sat Oct 05, 2024 10:44        Others

* గతేడాది సెప్టెంబరులో బెంగళూరులోని నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న లింకును టీటీ న్యాబ్ చేధించింది. సినీ ప్రముఖులూ నిందితుల దగ్గర డ్రగ్స్ కొంటున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ముఠాను వినియోగదారులు ఎలా సంప్రదిస్తున్నారని ఆరా తీయగా స్నాప్చాట్ అని తేలింది. సందేశాలు అవతలి వ్యక్తులు ఎప్పటికప్పుడు అదృశ్యమవ్వడంతో దీని ద్వారా సంప్రదింపులు జరిపేవారని తేలింది.
తన కుమార్తె నగ్నచిత్రాలు సేకరించి ఓ వ్యక్తి వేధిస్తున్నాడని నగర సైబర్ప్రైమ్ పోలీసులకు తండ్రి నుంచి ఫిర్యాదు అందింది. పోలీసులు దాదాపు 15 రోజులు దర్యాప్తు చేసి యువకుణ్ని అరెస్టు చేశారు. నిందితుడు స్నాప్చాట్లో బాలిక నగ్నచిత్రాలు సేకరించి.. ఇతరులకు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. యాప్లోని సౌలభ్యాల దృష్ట్యా ఈ మాధ్యమం ఉపయోగిస్తున్నట్లు తేలింది.
సందేశం.. ఫొటో ఏదైనా పంపించాక అవతలి వ్యక్తి చూడగానే వెంటనే అదృశ్యమవుతాయి. స్నేహితుడి జాబితాలో ఉంటే చాలు వాళ్లు ఎప్పుడు ఎక్కడున్నారో ప్రాంతంతో సహా ఇట్టే తెలుసుకోవచ్చు.. ఫొటోలు, వీడియోలు, క్విజ్, గేమ్స్ తదితర ఆకర్షనీయ ఫీచర్లు ఎన్నో ఉన్న ప్రముఖ సామాజిక మాధ్యమం స్నాప్ చాట్ నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్లు ఇందులోని ఫీచర్లకు ఆకర్షితులై యువత ఎక్కువగా యాప్ను వినియోగిస్తుంటే.. మోసగాళ్లు అంతే అనువుగా మార్చుకుంటున్నారు.


ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10



లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాల షేరింగ్, డ్రగ్స్ విక్రయాలు, సైబర్ నేరాలు తదితర అనేక అసాంఘిక కార్యకలాపాల కోసం యాప్ను వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇటీవల కళాశాల యువత డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాల్ని వినియోగిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. వీరంతా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గ్రూపుల ద్వారా సంభాషణలు జరుపుతున్నట్లు గుర్తించారు. దీనిపై నిఘా పెంచి డ్రగ్స్ సరఫదారుల్ని కటకటాలు లెక్కించడంతో నేరగాళ్లు స్నాప్చాట్వైపు మళ్లుతున్నారు.
స్పందన ఆలస్యం.. దర్యాప్తునకు ఆటంకం
సైబర్, సెక్టార్షన్ వంటి నేరాల్లో అవతలి వ్యక్తుల సమాచారం బాధితులు తెలుసుకోలేరు. గుర్తుతెలియని నెంబర్ల నుంచి వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు పంపి వేధిస్తుంటారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు స్నాప్చాట్ యూజర్ డేటా పొందడంలో ఆలస్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఫలానా యూజర్ ఐడీ వినియోగిస్తున్న వ్యక్తి డేటా కావాలని యాప్ నోడల్ అధికారుల్ని కోరినప్పుడు స్పందన ఆలస్యంగా ఉంటోందంటున్నారు. దీనివల్ల దర్యాప్తు ఆలస్యం తోపాటు నేరగాళ్లు తప్పించుకోవడానికి కొత్త మార్గాలు ఉపయోగిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #snapchat #cibercrime #drugssupply #cheating #nudepics #todaynews #flashnews #latestupdate #policecase