బాంబు బెదిరింపులు... ఆకతాయిల కలకలం! పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే ఫేక్ కాల్స్!

Header Banner

బాంబు బెదిరింపులు... ఆకతాయిల కలకలం! పోలీసులను ముప్పుతిప్పలు పెట్టే ఫేక్ కాల్స్!

  Wed Oct 09, 2024 10:33        Others

అప్పటి వరకు కలిసి జంటగా తిరిగిన ప్రేమికుల మధ్య గొడవ తలెత్తింది. ప్రేయసి సొంతూరికి వెళ్లేందుకు రైలెక్కిందన్న కోపంతో ప్రియుడు ఆమె ప్రయాణిస్తున్న రైల్లో బాంబు ఉందంటూ పోలీసులకు సమాచారమిచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు రైలును నిలిపి తనిఖీ చేసి తప్పుడు సమాచారంగా తేల్చారు. పలు కారణాలతో.. ప్రియురాలిపై కోపం వచ్చినా.. ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలన్నా.. మానసిక ఒత్తిడి చిత్తు చేస్తున్నా.. మద్యం మత్తు తలకెక్కినా.. కొందరు వ్యక్తులు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేస్తున్నారు. మరికొందరు మెయిల్ ఐడీకి సమాచారం చేరవేస్తున్నారు.

బాంబు బెదిరింపులతో పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. కంట్రోల్రూంకు వచ్చిన సమాచారం ఆధారంగా 5-7 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడకు చేరుతుంటారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని కాపాడిన సందర్భాలూ ఉన్నాయి. అత్యవసర సమయంలో సంజీవనిగా ఉపకరించే సదుపాయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. వ్యక్తిగత అంశాలను వేదికగా మలచుకుంటున్నారని పోలీసు అధికారి ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. చార్మినార్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఐటీ కంపెనీలు, బస్ స్టేషన్లు, ట్యాంక్బండ్, సినిమా థియేటర్లలో బాంబు అమర్చారంటూ వచ్చే బెదిరింపు ఫోన్కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయి.


ఇంకా చదవండిమరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ! 



ఇదీ లెక్క..
• గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లకు వివిధ నేర ఘటనలపై డయల్ 100కు ఏటా 4 లక్షలకు పైగా ఫోన్కాల్స్ వస్తుంటాయి.
• పోలీసులను ఆటపట్టిద్దామన్న ఉద్దేశంతో 10 శాతం మంది ఫోన్ చేసి సమయాన్ని వృధా చేస్తున్నారని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
• రెండేళ్ల వ్యవధిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు 4 బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇవన్నీ ఆకతాయిలు చేసిన పనిగానే పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉదంతాలివి..
• చార్మినార్ వద్ద ఒక యువతి మానవబాంబుగా మారి మారణహోమం సృష్టించబోతుందంటూ ఫోన్కాల్. జాగిలాలు, డాగ్స్వ్కాడ్స్తో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఆ యువతిపై కోపంతో అలా చేసినట్లు నిందితుడు చెప్పాడు.
• సికింద్రాబాద్ అల్ఫా హోటల్లో లో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్కాల్తో పోలీసులు సోదాలు జరిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆకతాయి ఫోన్ చేసినట్లు గుర్తించారు.
• సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలులో అగంతకులు ఉన్నారంటూ ఒక వ్యక్తి సమాచారమిచ్చాడు. బోగీలో ఉన్న నిందితుడు సినిమాల్లో చూసినట్టుగా ప్రమాద సమయంలో పోలీసులు ఎలా వస్తారనేది తెలుసుకునేందుకు చేశానంటూ చెప్పడం గమనార్హం.
• శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బిహార్కు చెందిన వ్యక్తి రెండు నకిలీ మెయిల్స్ పంపాడు. కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో తప్పుడు సమాచారాన్ని చేరవేసినట్లు గుర్తించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలుఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చుఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


  


   #andhrapravasi #train #bombalert #fakecalls #warnings #police #fakenews #flashnews #todaynews #latestupdate