డిజిటల్ చెల్లింపుల రీతిలో ఆర్బీఐ సంచలన నిర్ణయం! యూపీఐ, 123పే సేవల్లో భారీ మార్పులు!

Header Banner

డిజిటల్ చెల్లింపుల రీతిలో ఆర్బీఐ సంచలన నిర్ణయం! యూపీఐ, 123పే సేవల్లో భారీ మార్పులు!

  Wed Oct 09, 2024 14:30        Others

డిజిటల్ పేమెంట్స్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయాలను ప్రకటించింది. యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5వేలకు పెంచింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తూ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. యూపీఐ లావాదేవీల్లో నగదు చెల్లింపు పరిమితుల పెంపు.. వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి దోహదపడుతుందని చెప్పారు.
* ప్రతి లావాదేవీకి యూపీఐ లైట్ పరిమితిని ప్రస్తుతమున్న రూ.500 నుంచి రూ.1000కి పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
అలాగే యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని ప్రస్తుతమున్న రూ.2000 నుంచి రూ.5000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
* ప్రతి లావాదేవీకి 'యూపీఐ 123పే' లిమిట్ను కూడా రూ.5 వేల నుంచి రూ. 10,000 ລ້.
"యూపీఐ సేవల ద్వారా డిజిటల్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత ఆర్థిక రంగం పూర్తిగా మారిపోయింది. యూపీఐ సేవలను మరింత విస్తృతపరచడానికి, ప్రోత్సహించడానికి మేం మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం” అని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.


ఇంకా చదవండిమరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ! 


ఏమిటీ యూపీఐ లైట్..?
ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయడానికి యూపీఐ లైట్ సేవలు సహకరిస్తాయి. ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 ఉండగా ఆ మొత్తాన్ని రూ. వెయ్యికి పెంచారు. ఇక యూపీఐ లైట్ సేవలు పొందాలంటే.. అందుకోసం యూపీఐ వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉండాలి. తాజాగా దాని పరిమితిని కూడా పెంచారు. యూపీఐ 123పే అనేది స్మార్ట్ ఫోన్ కాకుండా ఫీచర్ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులకు సంబంధించినది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలుఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చుఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


  


   #andhrapravasi #digital #payments #upilite #planchange #rbi #decision #todaynews #flashnews #latestupdate