వైద్య కళాశాలల నిర్మాణానికి నీతి ఆయోగ్ నిధుల హామీ! వీజీఎఫ్ తో గ్రీన్ సిగ్నల్!

Header Banner

వైద్య కళాశాలల నిర్మాణానికి నీతి ఆయోగ్ నిధుల హామీ! వీజీఎఫ్ తో గ్రీన్ సిగ్నల్!

  Wed Oct 09, 2024 19:44        Others

అమరావతి: రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడంపై నీతిఆయోగ్ సానుకూలంగా స్పందించింది. రెండు మూడు దశల్లో 12 వైద్య కళాశాలలకు వీజీఎఫ్ ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. వీజీఎక్పై నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ పాల్లో మంత్రి సత్యకుమార్ ఢిల్లీలో చర్చలు జరిపారు. ప్రతి వైద్య కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో నిర్వహణ వ్యయమే రూ.200 కోట్లు అవుతుందని నీతి ఆయోగ్ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. ప్రస్తుతం నిర్మిస్తోన్న 12వైద్య కళాశాలలకు ఎంతమేర వీజీఎఫ్ ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నాబార్డు నిధులతో నిర్మిస్తోన్న ఈ వైద్య కళాశాలల నిర్మాణానికి రాష్ట్ర వాటాగా గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులు అసంపూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఈ ఏడాది కొన్ని కళాశాలల్లో వైద్య విద్యా కోర్సులు ప్రారంభమయ్యేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రెండు మూడు దశల్లో వీజీఎఫ్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసే అవకాశం కనబడుతోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలుఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చుఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 


  


   #andhrapravasi #medical #college #greensignal #nitiayog #permission #todaynews #governement #union #amaravathi #flashnews #latestupdate