భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?

Header Banner

భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?

  Mon Jun 17, 2024 20:08        India

భారత్ -శ్రీలంక దేశాలు ప్రస్తుతం సముద్ర మార్గంలో కనెక్ట్ అవుతున్నాయి. త్వరలో భూమార్గంలోనూ రెండు దేశాలు అనుసంధానమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. భూమార్గంలో ఇరుదేశాల అనుసంధానానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై శ్రీలంక ప్రభుత్వం చేస్తున్న అధ్యయనం తుదిదశకు చేరుకుంది. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పర్యవేక్షించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “భారత్ - శ్రీలంక భూమార్గ అనుసంధానం ప్రాజెక్టుపై ప్రాథమిక అధ్యయనం ముగిసింది. త్వరలోనే తుది దశ నివేదిక వస్తుంది. ఆ తర్వాత మేం తగిన నిర్ణయం తీసుకుంటాం” అని రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రానున్న రోజుల్లో ఇరుదేశాల మధ్య పవర్ గ్రిడ్ ఏర్పాటు ప్రతిపాదనపైనా త్వరలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్తో చర్చిస్తామన్నారు. జూన్ 20న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శ్రీలంకలో పర్యటించనున్నారు. శ్రీలంకలోని ట్రింకోమలీ జిల్లాలో పారిశ్రామిక జోన్ ఏర్పాటు, మన్నార్లో అదానీ గ్రూపునకు చెందిన విండ్ పవర్ ప్రాజెక్టుపై అక్కడి ప్రభుత్వంతో జై శంకర్ చర్చించనున్నారు. కాగా, శ్రీలంకలోని మన్నార్ జిల్లాకు 27 కిలోమీటర్ల దూరంలో మన తమిళనాడులోని ధనుష్కోడి పట్టణం ఉంది.

 

ఇవి కూడా చదవండి 

నిప్పు నీళ్ళతో స్నానం ఎప్పుడైనా చూశారా! వీడియో వైరల్! 

 

టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చు! మస్క్ కామెంట్ లపై బిజేపి కౌంటర్! 

 

మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి! లోకేష్ ఆదేశాలు! 

 

ఈవీఎంలు ఎలా హ్యాక్ చేస్తారో ఎలాన్ మస్క్ నిరూపించాలి! పురందేశ్వరి కామెంట్స్! 

 

రేపు రాష్ట్రంలో కేంద్ర బృందాల పర్యటన! ముఖ్యంగా ఆ జిల్లాల్లో! 

 

ఇకపై ఆ రోడ్డు లో ఎలాంటి ఆంక్షలు ఉండవు! అందరికీ అందుబాటులో! 

 

NRI TDP జర్మనీ, హాంబర్గ్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు! రాష్ట్ర ప్రగతికి మొదటి మెట్టు! 

 

ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు! ఇది ఆరంభం మాత్రమే! 

 

జీతం ఒక రూపాయి... బాత్ టబ్ మాత్రం 26 లక్షలు! ఎలాగో ప్రజల సొమ్మేగా! మెల్లగా నొక్కేయాలి... అదే మ్యాజిక్కు! 

                                                                                          

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #India #Srilanka #Asia #IndiaSrilanka #IndianOcean