అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!

Header Banner

అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!

  Tue Jun 18, 2024 09:02        India

అసోంలోని శివసాగర్ జిల్లాలో సబ్సు పెట్టెల్లో తీసుకెళ్తున్న హెరాయిన్ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున నాగాలాండ్ నుంచి వస్తున్న ఓ ట్రక్కును శివసాగర్ జిల్లా పోలీసులు అడ్డగించారు. అనంతరం ఆ వాహనాన్ని తనిఖీ చేయగా..4.6 కిలోల బరువున్న హెరాయిన్తో కూడిన 399 సబ్సు బాక్సులు గుర్తించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు రూ.37 కోట్లు ఉంటుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అంచనా వేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కాగా, గతంలోనూ అసోంలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.

 

ఇవి కూడా చదవండి 

నీట్ పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌లపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌! ఆస‌క్తిక‌ర ట్వీట్‌! 

 

అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ! 

 

భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?

 

నిప్పు నీళ్ళతో స్నానం ఎప్పుడైనా చూశారా! వీడియో వైరల్! 

 

టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చు! మస్క్ కామెంట్ లపై బిజేపి కౌంటర్! 

 

మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి! లోకేష్ ఆదేశాలు! 

                                                                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #India #Assam #DrugBust #DrugsSmuggling #Illegal