మన్ కీ బాత్ రీ ఎంట్రీ! ప్రజలతో మళ్లీ ప్రత్యక్ష ప్రసారం!

Header Banner

మన్ కీ బాత్ రీ ఎంట్రీ! ప్రజలతో మళ్లీ ప్రత్యక్ష ప్రసారం!

  Sun Jun 30, 2024 12:49        India, Politics

ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మోదీ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25న చివరి మన్‌ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు ప్రధాని మన్ కీ బాత్‌కు విరామం ఇచ్చారు.

 

ఇంకా చదవండి: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో పిడుగుపాటు! సుమారు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం!

 

తాజాగా, మోదీ దేశ ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ మొదలు పెడుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం ఉమ్మడి కృషి అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మన్ కీ బాత్ మళ్లీ ప్రారంభం అవుతుందని జూన్ 18నే మోదీ ధ్రువీకరించారు. కార్యక్రమంపై ప్రజలు తమ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. Mygov Open forum, NaMo యాప్, లేదా 1800-11-7800కు కాల్ చేసి తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు.

 

ఇంకా చదవండి: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఆసుపత్రుల పరిస్థితి! కనీస సదుపాయాలు లేని ఆసుపత్రులే ఎక్కువ!

 

2014 అక్టోబర్‌లో మన్‌ కీ బాత్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రజలతో నేరుగా అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్టు ప్రధాని అప్పట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ అంశాలు, ఇతర స్ఫూర్తివంతమైన విషయాలు పంచుకునేందుకు తనకు ఇదో చక్కని వేదిక అని మోదీ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియోకు ఉన్న 500 బ్రాడ్‌కాస్టింగ్ సెంటర్ల ద్వారా ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 22 భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, చైనీస్, అరబిక్ వంటి 11 విదేశీ భాషల్లోకి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.

 

ఇంకా చదవండి: నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

 

నకిలీ పత్రాలతో అమెరికా కాలేజీలో అడ్మిషన్! భారత విద్యార్థి అరెస్టు, 20 ఏళ్ల జైలు శిక్ష!

 

పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు ఇవే!

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

 

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

 

మరోచరిత్ర సృష్టించనున్న చంద్రబాబు! స్వయంగా ఇళ్లకు వెళ్ళి పెన్షన్ పంపిణీ! ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం!

 

అమరావతికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం! రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మికి కీలక బాధ్యతలు!

 

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #MannKiBaat #ModiSpeaks #PMModi #RadioAddress #IndiaConnects #MannKiBaatReturns #PublicEngagement #ModiInteraction #IndiaSpeaks #NationalBroadcast