ఉద్యోగాలు పేరుతో మోసాలు పట్ల తస్మాత్ జాగ్రత్త! కార్యక్రమం ద్వారా 44 ఫిర్యాదులు!

Header Banner

ఉద్యోగాలు పేరుతో మోసాలు పట్ల తస్మాత్ జాగ్రత్త! కార్యక్రమం ద్వారా 44 ఫిర్యాదులు!

  Wed Jul 10, 2024 07:00        India, Others

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజయనగరం ఎస్పీ దీపిక పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 44 ఫిర్యాదులు స్వీకరించారు. రాజాం నగరానికి చెందిన వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.మూడు లక్షలు తీసుకున్నారని, నేటి వరకూ ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వలేదని, న్యాయం చేయాలని తెర్లాం మండలం డి.గదబవలసకు చెందిన వ్యక్తి కోరారు. తనకు ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కల్పిస్తానని తోటపాలెంనకు చెందిన వ్యక్తి రెండు లక్షలు తీసుకున్నారని, నేటి వరకూ ఎటువంటి ఉద్యోగం కల్పించలేదని, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని విజయనగరానికి చెందిన మహిళ ఫిర్యాదు చేశారు. తన భర్తతో ఉన్న వివాదాలను పరిష్కరిస్తానని రామవరానికి చెందిన వ్యక్తి రూ.20 వేలు తీసుకుని, వివాదం పరిష్కరించలేదని, ఎన్నిసార్లు అడిగినా, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని గంట్యాడ మండలం రామవరానికి చెందిన మహిళ ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి, తీసుకున్న చర్యలను నివేదించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌పీ ఆష్మాపరహీన్‌, డీఎస్పీ వీరకుమార్‌, సీఐలు విజయనాఽథ్‌, నర్సింహమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు.

 

ఇంకా చదవండి: రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహ్రెయిన్ మరియు సౌదీలలో ట్రావెల్ రంగానికి చెందిన ఉద్యోగాల అవకాశం! ఆకర్షణీయమైన జీతం! వెంటనే అప్లై చేసుకోండి!

 

ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!

 

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!

 

ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

 

మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?

 

మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!

 

అమరావతి ORR వలన రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారనున్నది! ప్రాజెక్టు పూర్తి విశేషాలు! జరగబోయే మార్పులు! ఆ ప్రాంతాల వారికి పండగే!

 

అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Jobs #FakeJobs #AndhraPradesh