10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!

Header Banner

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!

  Tue Jul 16, 2024 21:40        India, Employment

సెంట్రల్ రైల్వే ‘రిక్రూట్‌మెంట్ సెల్’ 10వ తరగతి అర్హతతో మొత్తం 2,424 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌పై ( rrccr.com ) ఆన్‌లైన్‌లో ఆగస్టు 15 లోపు దరఖాస్తు సమర్పించాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. 10వ తరగతిలో 50 శాతం మార్కులతో పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తించిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను (ఐటీఐ అప్రెంటిస్) కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుదారుల వయసు  15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు సడలింపు ఇస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. వయోపరిమితికి జులై 15 కటాఫ్ తేదీగా ఉంది. కాగా అభ్యర్థులు మ్యాథ్స్, ఐటీఐలో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ లిస్టును తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థులను సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. కాగా మరింత సమాచారం కావాలనుకున్న అభ్యర్థులు సెంట్రల్ రైల్వేస్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

 

ఇంకా చదవండి: టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే!

 

ఏపీలో మద్యంతర ఎన్నికలు అంటూ వైసీపీ నేత కామెంట్స్! ఇదంతా టాపిక్ డైవర్ట్ చేయడానికే కదా!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఈ రైళ్లకు అదనపు బోగీలు!

 

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‌ తమ్ముడు అరెస్ట్! గోవా కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ దందా!

 

ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడిని గుర్తించిన FBI! ఐడీ కార్డులు లేకుండా ఎలానో తెలుసా?

 

పైకి చూస్తే పూలతోట.. లోన మాత్రం కథ వేరే! గొప్పోడివయ్యా సామీ! మనోడి తెలివిని చూసిన పోలీసులు షాక్!

 

పిల్లలు సంపాదించే ఆదాయం పరిధిలో వచ్చే నియమాలు ఏంటి? ఆదాయ పన్ను చెల్లించాలా? ఆ వివరాలు మీకోసం!

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్! ఇక నుంచి సులువుగా దర్శనం, గదులు! తిరుపతి దేవస్థానంపై ప్రత్యేక దృష్టి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #RailwayRecruitment #RailwayJobs #JobsNews #IndianRailways