విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

Header Banner

విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల రూపాయలు! విజయవాడలో స్కూల్ సంచలనం!

  Fri Aug 09, 2024 20:40        India

విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా

విద్యార్థుల పై తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలి


రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ స్థానిక ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖల అధికారులతో విద్యార్థులకు నెలలో ఒకరోజు గంజాయి మారకద్రవ్యాల పై అవగాహన కల్పించాలి

చైర్మన్ దీనిని బాధ్యతగా తీసుకోవాలి


వివరాల్లోకి వెళితే

విధ్యార్ధుల బ్యాగుల్లో గంజాయి...

స్కూల్స్ బ్యాగుల్లో లక్షల్లో డబ్బులు, షాకింగ్ విషయాలు...

ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల వినియోగంపై సర్వత్రా ఆందోళన నెలకొంది...

మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్ధుల బ్యాగ్లలో డ్రగ్స్ తో పాటు లక్షల రూపాయల నగదు పట్టుబడిన ఘటన ఆసక్తికరంగా మారింది...

గత వారం విజయవాడలో ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కొంతమంది స్టూడెంట్స్ టాయిలెట్స్లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించేసరికి అంతా షాక్ కు తిన్నారు...

అనుమానం వచ్చి 9,10 వ తరగతి విద్యార్ధుల స్కూల్ బ్యాగ్ లను తనిఖీ చేయడంతో కొంతమంది బ్యాగుల్లో ఎలక్ట్రానిక్ సిగార్స్, గంజాయి వంటి మత్తు పదార్ధాలు దొరికాయి...

సదరు విద్యార్ధుల పేరేంట్స్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. మత్తు పదార్ధాలు సేవిస్తున్న విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు...


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



ఈ క్రమంలో విధ్యార్ధులకు సంబందించి ఎన్నో ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి...

ఇదే స్కూల్ కు చెందిన ఓ స్టూడెంట్ ఆన్ లైన్ గేమ్స్ లో పది లక్షల రుపాయలు గెలిచాడట...

ఆ డబ్బును తన దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది కలుగుతుందని, సుమారు ఆరేడు లక్షలు స్నేహితులకు ఇచ్చాడు...

అంత డబ్బు ఇళ్లకు తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పడంతో వారు స్కూల్ మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేశారు...

దీనిపై స్కూల్లో విచారణ చేయగా సదరు స్టూడెంట్ మొబైల్ ఫోన్ లో ఆన్లైన్లో పలురకాల బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నట్టు గుర్తించారు...

ఇలా ఆన్ లైన్ లో సంపాదించిన డబ్బులను ఫ్రెండ్స్ కు ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది...

సదరు విద్యార్ధిపై సైతం స్కూల్ మేనేజ్మెంట్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది...

ఇక 9వ తరగతి చదివే కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య విజయవాడ లోని ఓ స్టార్ హోటల్లో బర్త్ డే పార్టీ జరుపుకున్నారు...

14 ఏళ్ల లోపు విధ్యార్ధులు మాత్రమే ఉన్న వారికి చెన్నై కోల్కత్తా నేషనల్ హైవేపై ఉన్న ఓ స్టార్ హోటల్లో పార్టీ చేసుకోడానికి అనుమతించారు...

ఈ పార్టీలో కొంతమంది స్టూడెంట్స్ మధ్యం సేవించినట్టు తెలుస్తోంది...

హోటల్ లో పుట్టిన రోజు పార్టీ విషయం ఆలస్యంగా తెలిసిన పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్ కు కంప్లైంట్ చేశారు...

పాఠశాలలో టాయిలెట్ ప్రదేశాలు మినహా, ప్రతి ప్రాంతం కవర్ అయ్యేలా సీసీ కెమెరాల ఏర్పాటు చేసినా విద్యార్ధులు గాడి తప్పుతున్నారని స్కూల్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది...

ఇంటి దగ్గర పేరెంట్స్ పర్యవేక్షణా లోపంతోనే ఈ సమస్య వస్తోందని అంటున్నారు...

పిల్లలు ఏంచేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచిస్తున్నారు.



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కేంద్రం గుడ్‌న్యూస్.. ఉచితంగా కుట్టుమిషన్! ఇలా దరఖాస్తు చేసుకోండి! లేట్ అయితే అవకాశం మిస్ అవ్వచ్చు!

 

పాస్ పోర్ట్ ఇలా కూడా నిరాకరిస్తారాబ్రిటన్ లో ఓ పాపకు వింత అనుభవం! ఇలా మీకు కూడా జరగవచ్చు!

 

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం! టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఫిక్స్!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! జనసేనలోకి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే!

 

యూకే వెళ్తున్న భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక! కారణం ఏంటంటే!

 

తహసీల్దార్ కార్యాలయంలో దస్త్రాల కక్కలు! 25 ఎకరాల భూమి ఆక్రమణపై ఎత్తుగడ!

 

కొడాలి నానివంశీలను దాచింది పేర్ని నానినే! శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ రెడీ! సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి!

 

రోజా కి మొదలైన టార్చర్! పాలిటిక్స్ లో కాదు సినిమాల్లో కూడా కనపడకుండా! రాజీనామా కి రెడీగా ఉందా!

 

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ పై పోలీసు కేసు! అసలు ఏం చేశాడో తెలుసాఇలాంటివాడికి ఏ శిక్ష వేసినా తక్కువే!

 

48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు! సీఎం చంద్రబాబు భారీ శుభవార్త! ఇక ఆ పథకాలు కూడా లైన్ లోకి!

 

వాలంటీర్లకు భారీ శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #drugs #school #bags #money #todaynews #flashnews #latestupadtes #livenews