ఆర్థిక లావాదేవీలే చిన్నారి హత్యకు కారణం! వీడిన పుంగనూరు హత్య కేసు మిస్టరీ!

Header Banner

ఆర్థిక లావాదేవీలే చిన్నారి హత్యకు కారణం! వీడిన పుంగనూరు హత్య కేసు మిస్టరీ!

  Sun Oct 06, 2024 16:20        India

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించారు. చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. ఎస్సీ తెలిపిన వివరాల ప్రకారం.. పాప తండ్రి ఓ మహిళకు మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆమె అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో దూషించాడు. సివిల్ కోర్టులో కేసు వేస్తానని బెదిరించాడు.

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

దాంతో ఆమె పాప తండ్రిపై పగ పెంచుకుంది. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న పాపను ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టింది. అనంతరం ఆమె తన తల్లి, మరో మైనర్‌ బాలుడితో కలిసి ఆ చిన్నారి ముక్కు, నోరు గట్టిగా మూసి హత్యకు పాల్పడింది. హత్య తర్వాత చిన్నారిని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారు. ఈ హత్యకు పాల్పడిన రేష్మను, ఆమె తల్లి హసీనాను, హత్యకు సహకరించిన మైనర్ బాలుడు అఖిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి మిస్ అయిన రోజునే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారు. 

 

ఇంకా చదవండిఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు.. ప్రజా సంస్థ! చార్జింగ్ సౌకర్యాల కోసం అనేక చోట్ల! రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్ గా!

 

చిన్నారి ఒంటిపై ఎలాంటి గాయం లేదని పోలీసులు చెప్పారు. ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే దర్యాప్తునకు ఆదేశించానన్నారు. పక్కా ఆధారాలతో పోలీసులు చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నారని పేర్కొన్నారు. మీడియాపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని ఛానెల్స్ చిన్నారి మృతిపై తప్పుడు ప్రచారం చేశాయి. కనీసం నిబంధనలు పాటించకుండా చిన్నారి పేరును, ఫొటోలను ప్రసారం చేశారు. ఇలాంటి విషయాల్లో మీడియా బాధ్యతగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఐఐసీ, మారిటైం బోర్డు నూతన ఛైర్మన్లను అభినందించిన హోంమంత్రి! రూ.2,350 కోట్ల పెట్టుబడులు, 4,300 మందికి ఉపాధి!

 

ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!

 

ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంచి నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు! కొన్ని జిల్లాల్లో 100 కిలోమీటర్లకు పైగా!

 

ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!

 

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP