జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు! హమ్‌సఫర్‌ పాలసీని ప్రారంభించిన కేంద్రమంత్రి!

Header Banner

జాతీయ రహదారులపై మరిన్ని సౌకర్యాలు! హమ్‌సఫర్‌ పాలసీని ప్రారంభించిన కేంద్రమంత్రి!

  Tue Oct 08, 2024 22:00        India

దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్‌వర్క్‌లో కొత్తగా మరికొన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌ తదితర అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ‘హమ్‌సఫర్‌ పాలసీ’ని ప్రారంభించారు. ఈ పాలసీలో క్లీన్‌ టాయిలెట్స్‌, బేబీ కేర్‌ రూమ్స్‌, వీల్‌చైర్స్‌, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌, పార్కింగ్‌ ప్లేస్‌, ఫ్యూయల్‌ స్టేషన్లలో హాస్టల్‌ తదితర సేవలను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విధానంలో హైవే వాహనదారులకు అనుకూలమైన, సురక్షితమైన, ఆనందదాయకమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది. అలాగే, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంతో పాటు ఉపాధిని సృష్టించడంతో పాటు కొత్తగా ఉద్యోగులు కల్పించి జీవనోపాధిని పెంచుతుందన్నారు.

 

ఇంకా చదవండిమరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ! 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ హమ్‌సఫర్‌ బ్రాండ్‌ దేశంలోని ప్రపంచస్థాయి హైవే నెట్‌వర్క్‌లో ప్రయాణికులు, డ్రైవర్లకు అత్యంత భద్రతతో పాటు సౌకర్యాలకు పర్యాయపదంగా మారుతుందన్నారు. జాతీయ రహదారులపై నాణ్యమైన, ప్రామాణికమైన సేవలను అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మా హైవే నెట్‌వర్క్‌లో అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని గడ్కరీ చెప్పారు. ఈ పాలసీని సిద్ధం చేసే సమయంలో నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, వ్యర్థాల పునర్వినియోగం, సౌరశక్తి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్ పంపుల యజమానులు పెట్రోల్ పంపుల వద్ద నిబంధనల ప్రకారం.. కనీస సౌకర్యాలు కల్పించాలని మంత్రి కోరారు. హైవేల పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచి ప్రజలు వినియోగించుకునేలా చూడాలన్నారు. చాలా పెట్రోల్‌ పంపుల వద్ద టాయిలెట్స్‌ మూసివేయడం తాను చూశానన్నారు. అలా చేయకపోతే బంకులు మూసివేసేందుకు అవకాశం ఉండవచ్చన్నారు. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వాలంటీర్లకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే రూ.10వేలు, ఉద్యోగం! ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు!

 

పది పాస్ అయితే చాలు.. నెలకు రూ.20 వేలు పొందొచ్చు, ఎలా అంటే! రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో!

 

ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌! 20 వేల మంది నివాసం!

 

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సృష్టించిన సంకేతాలు! కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల అంచనాలు!

 

మ‌రికాసేప‌ట్లో చంద్ర‌బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ! పెళ్లి కార‌ణంగా చాలా కాలం!

 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! టీడీపీలో చెరనున్న మాజీ ఎమ్మెల్యే!

 

చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ట్విస్ట్, వైసీపీ లీడర్! అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు!

 

మరోసారి ఎంజీఆర్ గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్! ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

  

 


   #AndhraPravasi #India #Travel #NationalHighways #NHAI