స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రెండున్నర కోట్లు కొట్టేశారు! కర్ణాటకలో కొత్త స్కామ్!

Header Banner

స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రెండున్నర కోట్లు కొట్టేశారు! కర్ణాటకలో కొత్త స్కామ్!

  Mon Jan 20, 2025 13:18        India

కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా పంపించిన దుండగులు.. దాంట్లో సిమ్ వేయగానే స్కామ్ చేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. కొత్త సిమ్‌ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియర్ లో నిజంగానే సెల్ ఫోన్ పంపించారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులకు రెండు కేటగిరీలుగా విభజన - తాజా లిస్టువేతనాలు ఫిక్స్ - మరో కీలక నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్ లోని సిమ్ తీసి కొత్త ఫోన్ లో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్ లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోన్ కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు. అయితే, అప్పటికే ఆ ఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్ వర్డ్ లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు! 15 రోజుల క్రితం..

   

గుడ్ న్యూస్: ఇకపై ప్రతినెలా మూడో శనివారం.. ఇలాంటి స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు! దీని కోసం త్వరలోనే..

 

జగన్‌పై నిప్పులు చెరిగిన మంత్రి! ఆ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.. అసలు విషయం ఇదే!

 

ఆ పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్న సినీ నటుడి కూతురు! రాజకీయాల్లో కీలక పరిణామం...

    

జగన్ వ్యవహారం పై అమిత్ షా ఆరా.. మొత్తం చెప్పేసిన చంద్రబాబులోకేష్! ఎందుకో తెలుసా ఇక జైలుకేనా?

 

ఏపీ శుభవార్త: ఈ పథకాల్లో మూడు రకాలు.. ఆ రైతులకు అకౌంట్లో డబ్బు జమ.. మీకు వచ్చిందా?

 

జగన్ అసమర్థ పాలనతో బైపాస్ పనులపై రూ.400 కోట్ల అదనపు భారం! కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #Crimes #CyberCrimes #Technology