అమరావతి వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయింపు!

Header Banner

అమరావతి వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయింపు!

  Wed Jul 10, 2024 14:58        అమరావతి - The Capital

అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ఇప్పటికే ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడంతో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పై అంత దృష్టి పెట్టలేదు అని సమాచారం. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ రాష్ట్ర ప్రజల ఆశలు చిగురించాయి. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం..ఈ ఏడాది బడ్జెట్లోనే నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

189 KM ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.25 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఈ సారి బడ్జెట్లో రూ.5-10వేల కోట్లు కేటాయించే అవకాశముందని సమాచారం. భూసేకరణ సహా అన్ని ఖర్చులను కేంద్రమే భరించనుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ఔటర్ రింగ్ రోడ్డును 6 లైన్లతో ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. రాజధాని అమరావతిలో లాజిస్టిక్, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. ఈ క్రమంలోనే 25,000 కోట్ల రూపాయల విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టును అమరావతికి మంజూరు చేశారని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి 

కలవరం రేపుతున్న అమెరికా విద్యార్ధుల మరణాలు! ఈ వారంలోనే నలుగురు!

 

ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్! 

 

విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు! 

 

అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి! 

 

కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే? 

 

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్! 

 

మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!

                       

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Amaravathi #ORR #AndhraPradesh #TDP #CBN ##CMCBN #CBNAgain #TheCapital #CapitalAmaravathi