స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద ప‌టిష్ట భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాలి! ఏయూ ప‌రిధిలోని స్ట్రాంగ్ రూమ్‌ల త‌నిఖీ..కుమార్ మీనా

Header Banner

స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద ప‌టిష్ట భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాలి! ఏయూ ప‌రిధిలోని స్ట్రాంగ్ రూమ్‌ల త‌నిఖీ..కుమార్ మీనా

  Sat May 18, 2024 19:58        Politics

విశాఖ‌పట్నం, అభి మీడియా సొల్యూషన్స్ ప్రత్యేక ప్రతినిధి:

ఈవీఎంలు భ‌ద్ర‌ప‌రిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద అన్ని ర‌కాల‌ భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని, ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని జిల్లా అధికారుల‌కు సూచించారు. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప‌రిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ల‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా. ఎ. మ‌ల్లికార్జున, పోలీసు క‌మిష‌న‌ర్ డా. ఎ. ర‌విశంక‌ర్ తో క‌లిసి శ‌నివారం ఉద‌యం ఆయన ప‌రిశీలించారు. విశాఖ‌ప‌ట్ట‌ణం పార్ల‌మెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజక‌వర్గాల‌కు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ల‌ను త‌నిఖీ చేశారు. అక్క‌డ ప‌రిస్థితులను గ‌మ‌నించారు.

 

ఇంకా చదవండి: కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మళ్ళీ సీఎస్ కి లేఖ! ఒక్కో ఎస్పీ పోస్ట్ కు ముగ్గురు

 

త‌లుపుల‌కు వేసిన తాళాల‌ను, వాటికున్న సీళ్ల‌ను సునిశితంగా ప‌రిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకున్నారా లేదా అనే అంశాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌నిఖీ అనంత‌రం లాగ్ బుక్లో సంత‌కం చేశారు. మూడెంచ‌ల భ‌ద్ర‌త‌ను పాటించాల‌ని, ఇక్క‌డి ప‌రిస్థితుల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని క‌లెక్ట‌ర్ కు సూచించారు. అన‌ధికార వ్య‌క్తుల‌ను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించ‌రాద‌ని చెప్పారు. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని ర‌కాల జాగ్ర‌త్తలు వ‌హించాల‌న్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అక్క‌డి ప‌రిస్థితుల‌ను, జిల్లా యంత్రాంగం త‌ర‌ఫున చేపట్టిన చ‌ర్య‌లను సీఈవోకు క‌లెక్ట‌ర్, పోలీసు క‌మిష‌న‌ర్ వివ‌రించారు. ఆయ‌న వెంట జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డా.ఎ. మ‌ల్లికార్జున‌, పోలీసు క‌మిష‌న‌ర్ డా. ఎ. ర‌విశంక‌ర్, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఆర్వోలు, ఇత‌ర అధికారులు ఉన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా: టెక్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! వలసదారుల కోసం గ్రీన్ కార్డ్ అప్లికేషన్‌లను నిలిపివేసిన అమెజాన్, గూగుల్!

 

ఎన్నారై టిడిపి కువైట్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం! భారతదేశం లోని వారికి ఫోన్ కాల్ ద్వారా! తెలుగుదేశానికి ఓటు మిస్ కాకుండా!

 

గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!

 

కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!

 

మీకోసం గుడ్ న్యూస్! ఇప్పుడు మిస్ అయితే ఇక అంతే! స్మార్ట్‌ఫోన్‌లపై రూ.4000 తగ్గింపు! నేటి నుంచి 10 రోజులపాటు Poco May sale..

 

రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!

 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

 

రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!

 

ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #YCP #TDP #AndhraPradesh #APPolitics #APNews #KumarMeena