నెల్లూరులో మహిళలకు శుభవార్త! ఉచిత శిక్షణ, ఉద్యోగాలు! 600మందితో మహిళా వింగ్‌ను ఏర్పాటు!

Header Banner

నెల్లూరులో మహిళలకు శుభవార్త! ఉచిత శిక్షణ, ఉద్యోగాలు! 600మందితో మహిళా వింగ్‌ను ఏర్పాటు!

  Wed May 29, 2024 07:00        Politics

నెల్లూరులో మహిళలకు శుభవార్త.. ఉచిత స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ సెంటర్ ప్రారంభమైంది. నగరంలోని నారాయ‌ణ ఇంజ‌నీరింగ్ కాలేజీలో మాజీ మంత్రి పొంగూరునారాయణ ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్ట‌ర్‌, ప్రిన్సిపాల్‌, డిపార్ట్ మెంట్ వారి ఆధ్వ‌ర్యంలో ఈ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు దాదాపు 600మందితో మహిళా వింగ్‌ను ఏర్పాటు చేశామని.. వీరికి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇస్తామని నారాయణ తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందినవారికి ఐటీ ఉద్యోగాలు.. హాస్పిట‌ల్స్, బిజినెస్‌ల‌లో, ప‌లు కంపెనీల్లో వారికి ఉద్యోగాలు వ‌చ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఎన్నిక‌లకు ముందే ఈ సెంటర్ ప్రారంభించాలనుకున్నామని.. కానీ ఎన్నికల్లో అందరూ బిజీగా ఉంటారని వాయిదా వేశామన్నారు నారాయణ. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత ప్రారంభించామని తెలిపారు.

 

ఇంకా చదవండి: ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీది గెలుపంటే! ఏ1 రోబో సమాధానమిదే! సోషల్ మీడియాలో బాగా వైరల్!

 

నేటి నుంచి 30 మందితో.. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ఒక బ్యాచ్‌.. అలాగే సాయ‌త్రం 3 గంట‌ల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు మరో బ్యాచ్‌కు బేసిక్స్ చెప్పే విధంగా ఈ ప్రోగ్రామ్‌ను ఇంజ‌నీరింగ్ కాలేజీ డైరెక్ట‌ర్‌, ప్రిన్సిపాల్‌, డిపార్ట్ మెంట్‌ డిజైన్ చేసినట్లు తెలిపారు. గ‌తంలో తన ద‌గ్గ‌ర ఆఫీస్ బాయ్‌లుగా ప‌ని చేసిన ఎంతోమంది.. ఇప్పుడు అమెరికాలో ఉన్నార‌ని గుర్తు చేశారు మాజీ మంత్రి నారాయణ. మ‌హిళ‌లంద‌రూ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ని బాగా అవ‌గాహ‌న చేసుకోవాల‌ని.. అలాగే ఈ ప్రోగ్రామ్‌ను నారాయ‌ణ ఇంజ‌నీరింగ్ కాలేజీ డైరెక్ట‌ర్‌, ప్రిన్సిపాల్‌, డిపార్ట్ మెంట్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరులో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేసి యువ‌తీ యువ‌కుల‌కు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #UnEmployed #Jobs #TDP #Nellore #FreeCourse