ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు! ఎంపీలతో కీలక వ్యాఖ్యలు!

Header Banner

ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు! ఎంపీలతో కీలక వ్యాఖ్యలు!

  Thu Jun 06, 2024 20:21        Politics

అమరావతి : ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు.

 

ఇంకా చదవండి: సింగరాయకొండలో ఇంటి యజమాని నిర్ణయం! వైసీపీ ఆఫీస్‌కు TO-LET బోర్డు!

 

అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను.. నేనే చూస్తాను. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి. అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి. ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి. నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తా. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి : టీడీపీ అధినేత చంద్రబాబు.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

పదవులు శాశ్వతం కాదు, గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!

 

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?

 

అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!

 

5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #ChandrababuKeyComments #TDPMeeting #BureaucratsNoMore #PoliticalGovernance #TDPLeaders #PartyStruggle #FuturePromises #ChandrababuSpeech #PoliticalLeadership #GovernanceReforms #TDPVictory #LeaderCommitment