ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీరు-చెట్టు రైతులను ఆదుకుంటాం! చంద్రబాబు హామీ!

Header Banner

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీరు-చెట్టు రైతులను ఆదుకుంటాం! చంద్రబాబు హామీ!

  Fri Jun 07, 2024 19:04        Politics

నీరు-చెట్టు రైతుల బకాయిలు ఐదు సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టడం దుర్మార్గం

 

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటాం

 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

 

ఉండవల్లిలో చంద్రబాబును కలిసి నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల నివేదిక సమర్పించిన ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు

 

2014 నుంచి 2019 వరకు నీరు చెట్టులో అన్ని రకాల అనుమతులతో చేసిన పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి 13 జిల్లాల్లో రైతులు చేసిన పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం దుర్మార్గం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు.


నిన్న రాత్రి నీరు చెట్టు పెండింగ్ బిల్లులపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నీరు చెట్టు పెండింగ్ బిల్లుల గ్రీవెన్స్ సెల్ బాధ్యులు,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఆయనను కలిసి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇదే విషయమై ఈరోజు ఉదయం విజయవాడలోని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యాలయం నుంచి ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ... గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్ని రకాల అనుమతులు ఇచ్చి జీ.వో 187 ద్వారా నీరు చెట్టు పథకంలో చెరువుల పూడికతీత, కాలువల పూడికతీత, చెక్ డ్యామ్ ల నిర్మాణం,పంట కుంటల నిర్మాణం తదితర నీటి సంరక్షణ పనులను ఉమ్మడి 13 జిల్లాల్లోని రైతులు నీటి సంఘాల ప్రతినిధులు,18,544 పనులను పూర్తిచేసి సి.ఎఫ్.ఎం.ఎస్ లో టోకెన్ బడిన తరువాత రూ.1303 కోట్లకు సంబంధించిన వై.సీ.పీ ప్రభుత్వం రకరకాల మెమో లతో కక్ష సాధింపు చేసి నిలుపుదల చేయగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు 2021లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నీరు చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి బకాయిలు ఉన్న రైతులను సమన్వయం చేసి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో మొత్తం ఇప్పటి పనులుచేసిన రతులచే వరకు 9,391 రిట్ పీటీషన్స్ వేయటం జరిగిందని, రాష్ట్ర గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మరలా 6,625 మంది రైతులు ధిక్కారణ పిటిషన్లు వేయగా 2022 మార్చి నుంచి 2024 ఏప్రిల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గతిలేని స్థితిలో 20 జీ.వోలు ఇచ్చి రైతులకు ఇప్పటివరకు రూ.968 కోట్ల చెల్లించిందని ఇంకను రైతులకు రూ.425 కోట్లు చెల్లించవలసి ఉందని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు. దీనిపై చంద్రబాబునాయుడు స్పందిస్తూ మన ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో సమీక్షించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.


రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు పూల బొకే అందజేసి ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఇవి కూడా చదవండి 

ఒడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న గుట్కా నాని! చెప్పింది గుర్తుందా అంటున్న తెలుగు యువత! 

 

ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన పనులకు మూల్యం చెల్లించక తప్పదు! మెయిన్ గేట్ వద్ద టీడీపీ సంబరాలు! 

 

మోడీపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం! భారత్ ఎవరికీ తలొగ్గదు! 

 

2047 నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తుంది! చంద్రబాబు వ్యాఖ్యలు! 

 

కీలక పదవులను కొరనున్న చంద్రబాబు! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త! అవి ఏంటి అంటే! 

 

రాష్ట్రానికి పట్టిన పీడ వదిలినందుకు ఒమన్ లో సంబరాలు చేసుకున్న టీడీపీ సభ్యులు! చంద్రబాబు కి అభినందనలు తెలిపిన NRI TDP సభ్యులు! 

 

పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం! 

 

ఖతార్ లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు! భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు! 

 

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు? 

 

ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్! 

 

ఎలెక్షన్లలో గెలిచిన ఆడుదాం ఆంధ్ర టీంతో జగన్ భేటీ! అంతకుమించి ఇంకేం చేయగలరులే! 

           

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #Amaravathi #Capital