ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?

Header Banner

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?

  Sun Jun 09, 2024 07:19        Politics

అమరావతి సీఐడీ నుంచి సంజయ్‌ అవుట్‌. విజిలెన్స్‌ నుంచి కొల్లి రఘురామిరెడ్డి తొలగింపు. కొత్త సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ఉత్తర్వులు. 2 బాధ్యతలూ డీజీపీకి అదనంగా అప్పగింత. ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, మైన్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డికీ ఉద్వాసన. తిరుమల అదనపు ఎస్పీ ఎమ్.శివరామి రెడ్డిపై బదిలీ వేటు.

 

ఇంకా చదవండి: టీడీపీకి కేంద్రంలో రెండు కీలక మంత్రి పదవులు! రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?

 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న క్రమంలో చంద్రబాబు ప్రక్షాళన మొదలుపెట్టారు. వరుసగా అధికారులపై వేటు పడుతోంది.. తాజాగా ఐపీఎస్‌లపై బదిలీ వేటు పడింది. సీఐడీ చీఫ్ (ఏడీజీ) ఎన్‌ సంజయ్‌తోపాటు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఐజీ, సిట్‌ చీఫ్‌ కొల్లి రఘురామ్‌రెడ్డిని బదిలీ చేశారు.. వారిద్దరిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇద్దరు అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరి బాధ్యతల్ని కూడా డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాకు అప్పగించారు. సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి జైలుకు తరలించే వరకు కొల్లి రఘురామరెడ్డి ఉన్నారు. అలాగే సీఐడీ చీఫ్‌గా సంజయ్ ఉన్నారు.

 

ఇంకా చదవండి: అమరావతిలో నిర్మాణ పనులకు ఊపందించిన కమిషనర్! ప్రత్యేక ఆదేశాలతో పరిశీలన!

 

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌ ఎండీ ఎం మధుసూదన్‌రెడ్డి, గనులశాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డిపైనా బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. వీరిద్దరినీ జీఏడీ (సాధారణ పరిపాలనశాఖ)లో రిపోర్టు చేయాలని సీఎస్ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2014 టీడీపీ ప్రభుత్వం హయంలో ఉచిత ఇసుక విధానంలో అనుచిత లబ్ధి పొందారంటూ చంద్రబాబుపై గనులశాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు చేయడంతో.. సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 

ఇంకా చదవండి: సోనియా, రాహుల్ గాంధీలకు కీలక పాత్రలు! కాంగ్రెస్ కీలక సమావేశంలో కొత్త బాధ్యతలు ఏంటో తెలుసుకోండి!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!

 

నీట్ పరీక్ష ఫలితాల్లో అనుమానాస్పద ఘటనలు! వెంటనే దర్యాప్తు చేపట్టాలన్న ప్రియాంక!

 

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య! పోలీసులపై నాని ఆగ్రహం!

 

తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!

 

అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #APIPSChanges #OfficerTransfers #AndhraPradeshNews #KeyRemovals #GovernmentShakeup #ChandrababuActions #CivilServiceUpdates #APAdministration #IPSUpdates #BreakingNewsAP