భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి పనులు వేగవంతం! కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు!

Header Banner

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి పనులు వేగవంతం! కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు!

  Thu Jun 13, 2024 14:55        Politics

ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు తనకు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారని, తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని రామ్మోహన్ నాయుడు అన్నారు. తనపై ఉంచిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానని పేర్కొన్నారు. మోడీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను కోరారని, ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్‌పై దృష్టి పెడతామని చెప్పారు. టైర్-2, టైర్-3 నగరాలకు విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని, సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించేలా చూస్తామని తెలిపారు.

 

ఇంకా చదవండి: సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!

 

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను రికార్డు సమయంలో పూర్తి చేస్తామని, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు కనెక్టివిటీ పెంచాలనే డిమాండ్ ఉందని చెప్పారు. సివిల్ ఏవియేషన్‌కు బెస్ట్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో పౌర విమానయాన శాఖలో బలమైన పునాదులు వేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

 

ఇంకా చదవండి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ! సీనియర్ టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోటీ!

 

పర్యావరణ అనుకూలంగా మంత్రిత్వ శాఖను తీర్చిదిద్దుతానని, ఎయిర్‌పోర్ట్‌లకు కావాల్సిన బడ్జెట్ లభిస్తుందని చెప్పారు. 2014లో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా విమానయాన మంత్రిత్వ శాఖను నిర్వహించారని, ఆయన దార్శనికతతో ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగం ముందుకు వెళ్లిందని, ఉడాన్ స్కీమ్‌ను అశోక్ గజపతిరాజు హయంలోనే ప్రారంభించారని, అందువల్ల ఎంతోమంది విమానయానం అందుబాటులోకి వచ్చారని అన్నారు. దేశంలో మరింత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువస్తామని, విమానయాన శాఖలో సింధియా అమలు చేసిన సంస్కరణలు కొనసాగిస్తామని అన్నారు.

గత పదేళ్లుగా వికసిత భారత్‌లో భాగంగా విమానయాన రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కడప, కర్నూలు విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలంగాణలో కూడా విమానయాన అవసరాలను గుర్తించి సహకారం అందిస్తామని, విమానయానం అవసరాలను తీర్చేందుకు సహాయం చేస్తామని తెలిపారు.

 

ఇంకా చదవండి: మదనపల్లెలో దారుణం! ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

నెల్లూరులో ఉద్రిక్తత! విజయోత్సవ ర్యాలీలో విధ్వంసం!

 

వేసవి సెలవులు ముగిశాయి! ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి!

 

నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్! "ఒక భార్యగా, ఒక అమ్మగా నా ఆనందం"!

 

కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

ఏపీ మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు! తొలిసారి గెలిచిన వారికి పెద్దపీట!

 

నారా చంద్ర బాబు అనే నేను! మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!

 

వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

 

AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #RamMohanNaidu #CivilAviationMinister #ModiGovernment #BhogapuramAirport #APDevelopment #UDANScheme #AviationReforms #TirupatiAirport #VijayawadaAirport #TelanganaAviation #AirportExpansion